దేశ భక్తే ‘ సివిల్స్’ విజయ రహస్యం

 *దేశ భక్తే ‘ సివిల్స్’ విజయ రహస్యం


*


                                                    పొగాకుబోర్డు ఎక్జుక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు 


 తాడేపల్లి (ప్రజా అమరావతి);


కె.ఎల్.విశ్వవిద్యాలయం లోని , ఆర్ట్స్ విభాగం , బి.ఎ. ఐఎఎస్ కళాశాల వారు నిర్వహించిన విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు, పొగాకు బోర్డు ఎక్జుక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు  పాల్గొని ప్రసంగించారు.


 సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించడం ఎలా?  అనే విషయంపై విధ్యార్ధులతో ఆయన మాట్లాడుతూ ఈ దేశం నాది, నా మాతృదేశం చాలా గొప్పది, నా దేశ పౌరులకు నాకు చేతనైనంతగా సేవచేయాలి అనే విదంగా సివిల్స్ విద్యార్ధులు ఆలోచన చేయాలని ఆయన అన్నారు. సాటి మానవుల కష్టాలలో పాలుపంచుకోవాలనే దృక్పదం,  ఆర్తుల కళ్ళల్లో ఆనందం చూడగలగాలి అనే భావాలను అభివృద్ధి చేసుకుంటే  దేశ అత్యున్నత సర్వీసు అయిన సివిల్ సర్వీసు సాధించటం సులభమే అన్నారు.


 


కేవలం పుస్తకాలలో తలమునకలై 12,15 అంటూ గంటలు లెక్కపెట్టుకుని చదవడమే కాకుండా చదివుతున్న విషయం మీద సంపూర్ణ స్పష్టత, పూర్తి అవగాహన కలిగివుండటం  విజయానిక సోపానం అవుతుందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఇవ్వబడిన డూ ఆర్ డై వంటి నినాదాన్ని లక్ష్య సాధనకు అన్వయించుకోవాలన్నారు. అకుంఠితమైన దీక్ష,పట్టుదలతో పాటు ఓర్పు, సహనం సివిల్ సర్వీసు లో విజయ సాధనకు పునాది అని గుర్తు చేశారు. ప్రతి విద్యార్ధి వాటిని అలవర్చుకుని విజయకేతనాన్ని ఎగురవేయాలన్నారు. సివిల్ సర్వెంటుగా ఎంపికయితే ఎదుర్కోనే కష్టా నష్టాలు, వృత్తి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఇప్పటినుండే భూతద్దంలో నుండి చూడకూడదన్నారు. ప్రతి అంశంపట్ల లోతైన అవగాహనను పెంచుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే విజయం తధ్యమన్నారు. విద్యార్ధినీ ,విద్యార్ధులు సివిల్ సర్వీసెస్ సంబంధమై అనేక విషయాలపై తమ సందేహాలను శ్రీధర్ బాబును అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ జి పార్ధ సారధి వర్మ గారు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఎన్.వెంకటరామ్ గారు, ఎం.హెచ్.ఎస్ విభాగ డీన్ డా.ఎం.కిషోర్ బాబు,విభాగాధిపతి డా.కె.ఎస్ వెంకటేశ్వర కుమర్ ,ఉపవిభాగ అధిపతి డా.అనిల్ కుమార్ ,అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments