శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా ఏఆర్ ధ్యేయం: జిల్లా ఎస్పీ .

 బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, బాపట్ల (ప్రజా అమరావతి);


*జిల్లా ఏఆర్ డీఎస్పీ ఎం.డి.హెచ్. ప్రేమ్ కుమార్ గారి ఛాంబర్ ను ప్రారంభించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ .*


*శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా ఏఆర్ ధ్యేయం: జిల్లా ఎస్పీ .



శాంతిభద్రతల పరిరక్షణకు ఏ ఆర్ విభాగం విశేష కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్  తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఏఆర్ డీఎస్పీ ఛాంబర్ ను జిల్లా ఎస్పీ  ప్రారంభించారు. 


జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల బాపట్ల జిల్లా పోలీస్ శాఖలోని ఏఆర్ విభాగం నందు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం.డి.హెచ్. ప్రేమ్ కుమార్ గారికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఛాంబర్ ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు జరగకుండా నివారించడమే కర్తవ్యముగా వుండే పోలీస్ శాఖలో శాంతి భద్రతల పరిరక్షణలో ఏఆర్ విభాగం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. జిల్లాలో గతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి జిల్లా ఏఆర్ విభాగ కార్యకలాపాలను పరిరక్షించేవారని, ప్రస్తుతం ఏఆర్ డీఎస్పీ గారు పరిరక్షిస్తున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే జిల్లా ఏఆర్ ధ్యేయమని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితోపాటు అదనపు ఎస్పి పి.మహేష్ , ఏఆర్-డి.ఎస్.పి ఎం.డి.హెచ్. ప్రేమ్ కుమార్ , జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ. శ్రీనివాస్ , అడ్మిన్ ఆర్.ఐ ఎల్.మన్మధరావు , వెల్ఫేర్ ఆర్.ఐ బి.శ్రీకాంత్ నాయక్ , ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments