గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ.



పాలకొల్లు, డిసెంబరు.20 (ప్రజా అమరావతి);

   

 గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ.



     మంగళవారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం లో గ్రామసచివాలయాన్ని  జిల్లా కలెక్టర్ తో కలిసి ఆకస్మికంగా ఆయనతనిఖీ చేశారు.  ఈ తనిఖీలో కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.  సచివాలయంలో అమలు చేస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అను ఆయన పరిశీలించారు . సచివాలయంలో ఉన్న ప్రెగ్నెంట్ మహిళలు ,  బాలింతలుతో మాట్లాడారు.  వారికి హిమోగ్లోబిన్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు.  హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు వారిని మోనిటర్ చేయాలని ఆయన సూచించారు.  వారికి అవసరమైన మందులు, సప్లిమెంట్స్ సక్రమంగా అందుతున్నాయో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు.


    ఆర్.బి.కె సిబ్బందితో మాట్లాడుతూ రైతులు యూరియా వాడకాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి డా. సమీర్ శర్మ అడిగి తెలుసుకున్నారు. 


     ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు శ్రీమతి పి. ప్రశాంతి ,  నరసాపురం సబ్ కలెక్టర్ ఎం. సూర్య తేజ,  వివిధ శాఖల జిల్లా అధికారులు ,  సచివాలయ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు .


Comments