గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారంనెల్లూరు, డిసెంబర్ 29 (ప్రజా అమరావతి): గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం


చుడుతూ, ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చిన ఘనత  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 గురువారం ఉదయం మనుబోలు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో ఇలాంటి ముఖ్యమంత్రి లేరని, ఉండుంటే తమ చదువులు కూడా ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేవని, ఇలాంటి ముఖ్యమంత్రి ఆ రోజుల్లో లేకపోవడం తమ దురదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ తరం విద్యార్థులకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లభించడం ఒక వరమని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలనే లక్ష్యంతో  ట్యాబ్ ల పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా విద్యార్థులు అన్ని సమయాల్లో ఉపయోగించుకునేలా బైజుస్ కంటెంట్ తో ట్యాబ్ ను రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థులకు ఏం కావాలో ముందుగా తెలుసుకుని, ఆ మేరకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సమకూరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నాడు నేడు పనులతో పాఠశాలల రూపు రేఖలు మార్చిన ముఖ్యమంత్రి, అమ్మ ఒడి పథకంతో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తల్లిదండ్రుల ఆలోచనలను గౌరవిస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నతంగా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.  మనుబోలు మండలంలో  రూ. 1.26 కోట్ల విలువైన 392 ట్యాబ్లను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం మీద రూ. 10 కోట్ల విలువైన 3130 ట్యాబ్ లను అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు  బైజుస్ కంటెంట్ తో రూపొందించిన ట్యాబ్ లను పంపిణీ చేశారు. 

  

 ఈ కార్యక్రమంలో  ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఈఓ శేషాద్రి వాసు,  హెచ్ఎం కాంతారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments