డా|| బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులను ఏప్రిల్ 14 కల్లా పూర్తిచేయాలివిజయవాడ (ప్రజా అమరావతి);*డా|| బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్*


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డా|| బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులను ఏప్రిల్ 14 కల్లా పూర్తిచేయాల


నే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానం (పీడబ్యూడీ గ్రౌండ్)లో శరవేగంగా జగరుతున్న విగ్రహ ప్రాజెక్టు పనులను గురువారం మంత్రులు పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలో అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగిన ఎంతో ఖరీదైన ప్రాంతంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా  డా. బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, ఇప్పటికే 248 కోట్లు వెచ్చించామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసం చేయలేదన్నారు. గురువారం అంబేడ్కర్ విగ్రహం బూట్లు వచ్చాయని, మిగతా భాగాలు ట్రావెల్ అవుతున్నాయని క్రమంగా వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతఖర్చైనా చెప్పిన సమయానికి పూర్తిచేస్తున్నామని, అందరూ సహకరించాలని మంత్రి మేరుగు నాగారున కోరారు.   

పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... డా. బీ.ఆర్. అంబేడ్కర్ భావజాలాన్ని, స్పూర్తిని నలుదిక్కులా వ్యాప్తిచేయాలనే లక్ష్యంతో విజయవాడ నగరం నడిబొడ్డున దాదాపు 3వేల కోట్ల విలువైన స్వరాజ్య మైదానంలో విగ్రహ ఏర్పాటు, ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామన్నారు. విగ్రహానికి సంబంధించిన అన్ని విడిభాగాలు ఒక్కొక్కటిగా ప్రాంగణానికి చేరుకుంటున్నాయని తెలిపారు. శరవేగంగా పనులు జరగుతున్నాయన్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేయడం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ముఖ్యమంత్రి ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. మంత్రివర్గంలో 70 శాతం మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారినే తీసుకుని సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ ఉండరని తెలిపారు.  పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, మౌలిక సదుపాయాల కార్పోరేషన్, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ అందరి అనుసంధానంతో సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. సంక్షేమ ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి?, నాయకుడంటే ఎలా ఉండాలో చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమమే నిదర్శమన్నారు. నగర ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, చిన్న వీధులలో నివాసితులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సురేష్ సూచించారు. 

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ వాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. Comments