అన్ని అధునాతన సౌకర్యాలతో అదనపు తరగతి గదులు మార్చి 15 నాటికి సిద్ధం చేయాలి



 అత్తిలి , జనవరి.28 (ప్రజా అమరావతి);


  అన్ని అధునాతన సౌకర్యాలతో అదనపు తరగతి గదులు మార్చి 15 నాటికి సిద్ధం చేయాల


ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ అధికారులు ఆదేశించారు .

విద్యార్థిని విద్యార్థులు మంచి వాతావరణం లో పరీక్షలు రాసేందుకు వీలుగా తరగతి గదుల రేన్నోవేషన్ ఉండాలని సూచించారు .


 శనివారం మనబడి నాడు-  నేడు  పనుల  అత్తిలి మండలం  అత్తిలి   గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న నాడు - నేడు  పనులను   పరిశీలించారు.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు - నేడు లో పాఠశాల అభివృద్ధిలో ఏమైనా  ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని  ఆయన అన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం గురించి సంబంధిత సహాయ ఇంజనీరు , ఇంజినీరింగ్ అసిస్టెంటు ను అడిగి తెలుసుకున్నారు



  నాడు నేడు లో అదనపు గదులు నిర్మాణం కు వచ్చిన స్టీల్ ,  సిమెంటు , ఇసుక ,  కంకర తదితర  మెటీరియల్ ఎంతవచ్చింది , ఎంత వినియోగించారు, ఇంకా ఎంత నిల్వలు ఉన్నాయి ఫిజికల్ గాను రిజిస్టర్ ను పరిశీలించారు. డబ్బులు ఎంత ఖర్చు చేశారు రిజిస్టర్ లను కూడా  పరిశీలించారు. 

 ఈ ఈ పరిధిలో ఉన్న 11 జూనియర్ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం మార్చి 15 నాటి బిల్డింగ్ మరమ్మతులు కూడా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరమ్మతులు చేసిన నూతనంగా నిర్మించిన అదనపుగా తరగతి గదిలలో విద్యార్థిని విద్యార్థులు ఆహ్లాదమైన వాతావరణం లో పరీక్షలు రాసే విధంగా వాటిని తీర్చిదిద్దాలని అధికారులను. 


 

ఈ  కార్యక్రమంలో  ఆర్జెడి డి మధుసూదన్ , డి ఈ వో ఆర్. వెంకట రమణ, సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయకర్త శ్యామ్ సుందర్ ,యం ఈ వో   జోష్నా , హెచ్ ఎం  ప్రేమజ్యోతి , 

ఈ ఈ ,ఏ ఈలు ,ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు , తదితరులు పాల్గొన్నారు.


Comments