సిఎస్ తో భేటీ అయిన పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రతినిధులు

 సిఎస్ తో భేటీ అయిన పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రతినిధులు


అమరావతి,24 జనవరి (ప్రజా అమరావతి):పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులు ఎకె తివారి మరియు ఎకె పాండాలతో కూడిన ప్రతినిధుల బృందం మంగళవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డితో భేటీ అయింది.ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిటీ గ్యాస్ డ్రిస్ట్రిబ్యూషన్(CGD) పైపు లైను విస్తరణకు సంబంధించిన వివిధ కీలక అంశాలపైన మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన ఇతర అంశాలపై వారు విసృతంగా చర్చించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిజిడి పైపు లైను విస్తరణకు సంబంధించి అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఇంకా ఈసమావేశంలో ఇందుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

అంతకు ముందు పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ప్రతినిధులు సిజిడి మరియు నాచురల్ గ్యాస్ పైపు లైనుపై  సమావేశమై ఈప్రాజెక్టు ప్రగతిని సమీక్షించారు. ఈపర్యటనలో భాగంగా వారు సిజిడి ఇన్ప్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ ప్రదేశాలను వారు పర్యటించారు.

ఈసమావేశంలో ఎపి మారిటైం బోర్డు సిఇఓ షాన్ మోహన్,పిఎన్ జిఆర్బి సంయుక్త అడ్వయిజర్ పవన్ యూనియాల్,డిప్యూటీ అడ్వయిజర్ ఆర్కె సాహి,ఎండి ఎపిజిడిసి మరియు జిజిపిఎల్ ఫంకజ్ భగత్,జిజిపిఎల్ జియం జి.అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

     

Comments