తోపుదుర్తి" విందుకు భారీగా జనం..!

 ●అంగరంగ వైభవంగా..!


●"తోపుదుర్తి" విందుకు భారీగా జనం..!●జన సంద్రమైన "తోపుదుర్తి"..!


●హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, మేయర్ ఇతర ప్రజాప్రతినిధులు..!తోపుదుర్తి గ్రామంలో బుధవారం  పెద్దమ్మ తల్లి ఊరుదేవర అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ విందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది తరలి రావడంతో తోపుదుర్తి గ్రామం జనసంద్రమైంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగలేదు. వేల సంఖ్యలో కార్లు, జీపులు, బైకులు వచ్చినా ఎక్కడికక్కడే పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచే భోజనాలు ప్రారంభమయ్యాయి. మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పెనుగొండ శంకరనారాయణ, పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి, కదిరి సిద్ధారెడ్డి, తాడిపత్రి పెద్దారెడ్డి, గుంతకల్ వెంకటరామిరెడ్డి, మడకశిర తిప్పేస్వామి, ఎమ్మెల్సీలు ఇక్బాల్, శివరామిరెడ్డి, ఎస్పీ పకీరప్ప, వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ అహ్మద్ ఏపీ ఆగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్ తో పాటు పలువురు సిఐలు ఎస్సైలు తహసిల్దార్లు ఎంపీడీవోలు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. అలాగే రాప్తాడు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులతోపాటు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.Comments