సర్వేపల్లి వైకాపాలోకి చేరికలు

 "సర్వేపల్లి వైకాపాలోకి చేరికలు


"


SPS నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కందలపాడు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 40 కుటుంబాలు.


దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసినా, పార్టీ అధికారంలోకి వచ్చినా, తమ గ్రామాల్లోని సమస్యలు పట్టించుకోలేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా, కందలపాడు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా ఆయన దగ్గరకు వెళ్లి, రైతులు పొలాల్లోకి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుందని, తమ అవస్థలు గమనించి, కనుపూరు కాలువపై బ్రిడ్జి నిర్మిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రయాణించేందుకు గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 24 గంటలల్లోపే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం, 2 నెలల కాలవ్యవధిలోనే కనుపూరు కాలువపై బ్రిడ్జి నియమించడంతో సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి వెంట నడవాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, గ్రామస్తులు అందరూ సమిష్టిగా చర్చించుకొని, సమిష్టిగా నిర్ణయం తీసుకొని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి చేరామని కందలపాడు గ్రామస్తులు తెలియజేశారు.

Comments