యువతకు దిశా నిర్దేశం చేసిన గొప్ప మహనీయులు స్వామి వివేకానందనెల్లూరు, జనవరి 12 (ప్రజా అమరావతి);


యువతకు దిశా నిర్దేశం చేసిన గొప్ప మహనీయులు స్వామి వివేకానంద


అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ కొనియాడారు.గురువారం మధ్యాహ్నం యువజన సర్వీసుల శాఖ నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.


ఈ వేడుకలకు   ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, సంయుక్త కలెక్టర్ శ్రీ రోనంకి కూర్మనాధ్, నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి  స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన గావించి  ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ  స్వామి వివేకానంద గొప్ప ఉపన్యాసకులని తన ప్రసంగంతో ఎలాంటి వారినైనా ఇట్టే కట్టిపడేసే చాతుర్యం కలవారున్నారు. వారు

125 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభలో ముందుగా తయారు చేసుకోకుండానే ఆంగ్లంలో   ప్రియమైన సహోదరులారా అని సంబోధించి ప్రసంగించడంతో మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయిందన్నారు.

వారి ప్రసంగానికి అమెరికా ప్రజానీకం నీరాజనాలు పలికారన్నారు. వారు

రామకృష్ణ మఠం స్థాపించి భారతీయ యువతకు ఒక దిశా నిర్దేశం చేశారన్నారు. వారు 39 తరాల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లి కీర్తి గడించారన్నారు. వారు చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆయన జన్మదినం జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవం గా 1984వ సంవత్సరంలో ప్రకటించిందన్నారు. 1970 సంవత్సరంలో కన్యాకుమారి దక్షిణ దిశలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు

ఇటువంటి మహనీయుల త్యాగాలను స్మరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాష్ట్రస్థాయి యువజన పోటీలలో నెగ్గిన నల్గురు విజేతలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు..


జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ  రోనంకి కూర్మనాద్ మాట్లాడుతూ దేశ భవిత యువత చేతిలో ఉందని, వారి శక్తి సామర్ధ్యాలను  సమాజాభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు.


స్వామి వివేకానంద లో ఏకాగ్రతతో కూడిన జ్ఞాపకశక్తి మంచి వాక్యాతుర్యం అనే రెండు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు.


అమెరికా యూరోపియా వంటి పలు పశ్చిమ దేశాలలో చాలామంది స్వామి వివేకానంద ప్రసంగాల కోసం వేచి ఉండే వారన్నారు.నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద బాల్యంలో పేరని వారు బి.ఏ. ఫైన్ ఆర్ట్స్ ఉత్తీర్ణులయ్యారని, యోగ మెడిటేషన్ లో ఖ్యాతి గడించారన్నారు.

వారు రామకృష్ణ మఠం స్థాపించి భారతదేశమంతా పర్యటించారని భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లారన్నారు. వారు 39 సంవత్సరాల అతి చిన్న వయసులోనే చనిపోయారన్నారు. అప్పటికే వారు అపారమైన జ్ఞాన సంపదను ఆర్జించారన్నారు.

 ఇటువంటి జ్ఞానవంతులు, సైద్ధాంతికులు భారతదేశంలో ఉన్నారా అని మన దేశం వైపు  ప్రపంచం మొత్తం చూసేలా స్వామి వివేకానంద చేశారన్నారు.


ఈ వేడుకల్లో పాల్గొంటున్న యువతీ యువకులు అందరూ వారికి ఇష్టమైన రంగాల్లో దినదినాభివృద్ధి చెంది అత్యున్నత శిఖరాలకు  చేరుకోవాలన్నారు.


నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు మార్గదర్శకులని వారి ప్రసంగాలు యువతను మంచి స్థాయిలో నిలబెడతాయన్నారు. వారు చూపిన మార్గంలో నేటి యువత పయనించి ఉన్నత  ఉన్నత శిఖరాలు  అధిరోహించాలన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.


సెట్నెల్ సీఈవో శ్రీ పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో జరిగిన యువజన  ఉత్సవాలలో జిల్లా నుంచి కూచిపూడి లో సిహెచ్ శరణ్య రెడ్డి, కథక్ లో కె త్రిపుర నికిత ప్రథమ స్థానంలో నిలిచారని వీణ వాయిద్యంలో ఆర్. గిరిజ, ఫ్యాన్సీ  వేషధారణలో  బి. మషీర తృతీయ స్థానాల్లో నిలిచారన్నారు.   వారిలో శరణ్య రెడ్డి, ఆర్ గిరిజ కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్లో జరిగిన జాతీయస్థాయి పోటీలకు వెళ్లారన్నారు.  రాష్ట్రస్థాయి పోటీల్లో నెగ్గిన కే త్రిపుర నికిత పి.మషిరాలను ప్రశంసా పత్రం జ్ఞాపికలు, శాలువాలతో  జడ్పీ చైర్పర్సన్, సంయుక్త కలెక్టర్, నగర మేయర్ ఘనంగా సత్కరించి  అభినందించారు.


అలాగే జిల్లా స్థాయిలో గత నవంబర్ మాసంలోజరిగిన యువజన ఉత్సవాల్లో నెగ్గిన యువతకు, ఈనెల 6,7 తేదీలలో వివిధ రంగాలలో నిర్వహించిన  జాతీయ యువజన దినోత్సవ పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను జిల్లా పరిషత్ చైర్పర్సన్, సంయుక్త కలెక్టర్, నగర మేయర్ అందజేసి వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో సెట్నెల్  సీఈవో శ్రీ పుల్లయ్య, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి శ్రీ మహేంద్ర రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, ఎల్డీఎం శ్రీకాంత్ ప్రదీప్ కుమార్ పలువురు విద్యార్థిని విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.Comments