ఎల్ పి ఎం ద్వారా భూ రికార్డుల రక్షణపెరవలి (ప్రజా అమరావతి): ఎల్ పి ఎం ద్వారా భూ రికార్డుల రక్షణభవిష్యత్తులో భూముల సమస్య లేకుండా రీ సర్వే ద్వారా సాకారం


కలెక్టర్ మాధవీలత ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ద్వారా భూ రికార్డులకు శాశ్వత హక్కు నిర్ధారణ చేయడం రీ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత  పేర్కొన్నారు.


బుధవారం ఉదయం పెరవలి గ్రామంలో జగనన్న భూ హక్కు మరియు భూ రక్షా రీ సర్వే డ్రోన్ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, సుమారు 100 సంవత్సరాల తర్వాత రెవెన్యూ రికార్డ్ లను జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు రీ సర్వే ప్రక్రియను చేపట్టడం జరుగుతోందని అన్నారు. 100 జరిగిన సర్వే తదుపరి పలు లావాదేవీలు, మ్యూటేషన్స్, సబ్ డివిజన్ జరగడం వల్ల రికార్డ్ ల విషయంలో పలు సందేహాలకు ఉత్పన్నం అయ్యాయని ఆమె పేర్కొన్నారు. వాటన్నింటికీ శాశ్వత పరిష్కారం కోసం సిఎం ఆదేశాలతో రాష్ట్రంలో సమగ్ర రీ సర్వే చేపట్టడం జరుగుతోందని అన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఆనాటి రికార్డు లను ప్యురిఫికేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపట్టడం లో భాగంగా పెరవలి లో ఈ రోజు డ్రోన్ సర్వే ను ప్రారంభించామన్నారు. ఈ సర్వే కు భూ యజమానులు, రైతులు సహకరించి, వారి వద్ద రికార్డు లతో సర్వే కి చెందిన కొలతలు, హద్దులు సరిగ్గా ఉన్నయో లేదో తెలియచెయ్యాలని కలెక్టర్  కోరారు. రీ సర్వే తదుపరి ఎల్ పి ఎం. పత్రం జారీ తో వారి రికార్డుల సమస్యలకు పూర్తి స్వచ్చిలత ఏర్పడుతుంది అని అన్నారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన కూడా నిర్ధారణ చేసి భూహక్కు పత్రలు జారీ చేయడం కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. డ్రోన్ సర్వే ద్వారా వేగంగా,  ఖచ్చితత్వం తో కూడి హద్దుల ను గుర్తించడం సాధ్యం అవుతుందన్నారు.  తొలుత కొబ్బరి కాయ కొట్టి రీ సర్వే పనులను కలెక్టర్ ప్రారంభించి, డ్రోన్ ను ఎగురవేయ్యాడం జరిగింది. అనంతరం రీ సర్వే చేపడుతున్న భూములకు సంబంధించిన రికార్డు లను, మ్యాప్ ని పరిశీలించారు. 


ఈ పర్యటన లో కలెక్టర్ వెంట జిల్లా సర్వే అధికారి పి లక్ష్మణ రావు,  యం. పి. పి. కె. సీతారామ్ ప్రసాద్, జడ్. పి. టి. సి. కె. రామ రంజని,  సర్పంచ్ లు జి. సీతమ్మ, పి. అంజి బాబు, మండల తాహిసీల్దార్, టి రాజరాజేశ్వరి, యం. పి. డి. ఓ, కె. రామకృష్ణ, డివిజనల్ సర్వే యర్, కె. రామకృష్ణ, సర్వే, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.Comments