రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
లింగ నిర్ధారణ చేసే ల్యాబ్ లపై , అబార్షన్ అయ్యే కేసులకు సంబంధించి ఆయా ఆసుపత్రుల వారీగా కేసులకు సంబంధించి పూర్తి స్థాయి అధ్యయన నివేదికలు సమర్పించాల
ని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదేశించారు.
మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పిసి అండ్ పీ ఎన్ డి టి యాక్ట్ పై సమన్వయ శాఖల, సభ్యుల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జరిగే జననాల నిష్పత్తి పై సమగ్రంగా నివేదిక అందచెయ్యల్సి ఉందన్నారు. వాస్తవంగా ఆసుపత్రులు, ల్యాబ్ లపై పర్యవేక్షణ లోపం ఉందన్న ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గర్భస్థ నిర్ధారణ చేసే కేసుల విషయంలో లింగ నిర్ధారణ కు సంబంధించి ఏమైనా కేసులు నమోదు అయ్యాయా అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉందన్నారు. ప్రతి ల్యాబ్ పై నిర్ణీత సమయం లో ఆకస్మిక తనిఖీలు సంబంధిత కమిటీ సభ్యులు అందరూ కలిసి చెయ్యవలసి ఉంటుందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని పేరున్న ఆసుపత్రులలో అబార్షన్ కేసులు నమోదు చెయ్యకుండా ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా వాటిపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం అన్నారు. జిల్లాలో బాల బాలికల జననాల నిష్పత్తి ప్రాతిపదికన నివేదిక రూపొందించుకుని విచారణ చేపట్టాలన్నారు. అబార్షన్ కు సంబందించి లింగ నిర్ధారణ(స్త్రీ పురుష) నివేదిక అందచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రెండు, మూడు నెలలకు జరిగే జిల్లా స్థాయి సమావేశం కు హాజరయ్యే కమిటీ సభ్యులు ప్రతి నెల తప్పకుండా సమావేశాలు చేపట్టాలని సూచించారు
వైద్య అధికారులు వివరాలు తెలుపుతూ, గత 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జిల్లాలో 18900 జననాలు సంభవించగా వాటిలో బాలురు 9776 మంది, బాలికలు 9125 మంది ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ బాలుర జననాలు జరిగిన మండలాలు పై దృష్టి పెట్టానని ముఖ్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 481 అబార్షన్ కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో 139 స్కానింగ్ సెంటర్స్ (ల్యాబ్ లు) ఉన్నాయని ప్రభుత్వ కేంద్రాలు 15, ప్రవేట్ కేంద్రాలు 124 ఉన్నట్లు తెలిపారు. కమిటీ ఆమోదం కోసం కొత్తగా రెండు , రెన్యూవల్ కోసం 10, కొత్త పరికరాలు ఏర్పాటు కోసం మూడు, చిరునామా మార్పు కోరుతూ ఒక దరఖాస్తు వచ్చినట్లు వైద్య అధికారులు అన్నారు.
ఈ కార్యక్రమం లో డి. ఏం. హెచ్. ఓ, డా. కె. వెంకటేశ్వ రరావు, డి. టి. సీ. ఓ, ఎన్. వసుంధర, డి. సి. హెచ్. ఎస్. డా. సనత్ కుమారి, డిప్యూటీ డియం హెచ్ ఓ లు, జి. వరల క్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment