అంగరంగ వైభవంగా ఇప్పటం గ్రామంలో డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం...

 అంగరంగ వైభవంగా ఇప్పటం గ్రామంలో డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం...


మంగళగిరి (ప్రజా అమరావతి);

వీరనారి చాకలి ఐలమ్మ  భవనం, సర్దార్ గౌతు లచ్చన్న  భోజనశాల,  వంగవీటి మోహన్ రంగా గార్ల కళావేదిక ప్రారంభం.


ఈరోజు సాయంత్రం 7.00 గంటలకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఇప్పటం గ్రామంలో సుమారు 1 కోటి రూపాయల కార్పొరేషన్ నిధులతో అత్యంత సుందరంగా నిర్మించబడిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు...


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు గారి హయాంలో గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడం, కాలక్రమేన దాన్ని ఆధునికరించి సుమారు 1 కోటి రూపాయలు కార్పొరేషన్ నిధులు కేటాయించి నిర్మించిన భవనాన్ని నేడు ప్రారంభించడం సంతోషకరంగా ఉందని అన్నారు..


అందరికీ అందుబాటులో వారి వారి కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఈ భవనం ఉంటుందని ఆయన అన్నారు..


చక్కటి భవన నిర్మాణానికి సహకరించిన ఇప్పటం గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు..


పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అత్యంత త్వరగా నిర్మాణం పూర్తి చేసిన నగరపాలక సంస్థ అధికారులతో పాటు ఇంజనీరింగ్ విభాగ సిబ్బందికి ఆయన తన అభినందనలు తెలియజేశారు...

Comments