పోషక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి

 *పోషక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి


*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జనవరి 09 (ప్రజా అమరావతి):


టీబీ వ్యాధిగ్రస్తులు పోషక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లో ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్ అభియాన్ నిక్షయమిత్ర కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధిగ్రస్తులకేజ్ పోషక పదార్థములను అందజేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. టీబీ వ్యాధి గ్రస్థులకు పోషకాహార నిమిత్తం వారి చికిత్స కాలం మొత్తం ఆరు నెలల పాటు విశ్వనాధ ఫౌండేషన్ సంస్థ ద్వారా రిటైర్డ్ ఐఏఎస్ పరమహంస వారు 50 మంది టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని వారికి పోషకాహార పదార్థాలను  అందించడం జరిగింది. ఇదే విధంగా జిల్లా మొత్తం మరో 55 టీబీ వ్యాధిగ్రస్తులను టీబీ సిబ్బంది దత్తత తీసుకొని పోషకాహార పదార్థాలు అందచేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, జిల్లా క్షయ నివారణ అధికారి డా.తిప్పయ్య, టీబీ సిబ్బంది అబిద్ బాషా, రవి కుమార్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, దేవేంద్ర  నాగసురేష్, నాగమణి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.



Comments