అన్నీ వర్గాల పేదలకు అండగా


నెల్లూరు (ప్రజా అమరావతి);


అన్నీ వర్గాల పేదలకు అండగా


ఉంటూ వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. 


సోమవారం పల్నాడు జిల్లా, వినుకొండ నుండి "జగనన్న చేదోడు పథకం" మూడో ఏడాది కింద లబ్దిదారుల ఖాతాలోకి జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో 3,30,145 మంది అర్హులైన రజక, నాయిబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు రూ. 330.14 కోట్ల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.  జగనన్న చేదోడు క్రింద ప్రతి ఏడాది 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ హాల్  నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  బొందిలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బి. కిశోర్ సింగ్, బి.సి  కార్పొరేషన్ ఈడి శ్రీ బ్రహ్మానందరెడ్డి, డీఆర్డీఏ పిడి శ్రీ సాంబశివారెడ్డి, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య,   జగనన్న చేదోడు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబుతో కలసి  జగనన్న చేదోడు పధకం కింద జిల్లాలోని 18,522   మంది  లబ్దిదారులకు 18.522 కోట్ల రూపాయల మెగా చెక్కును అందచేశారు.


ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న  రజక, నాయీబ్రాహ్మణ, ట్రైలర్స్ వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ జగనన్న చేదోడు పధకం కింద ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల వంతున 5 సంవత్సరాల పాటు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.   జగనన్న చేదోడు  పధకం కింద  మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా  3,30,145  మంది అర్హులైన రజక,  నాయీబ్రాహ్మణ, టైలర్స్ లబ్ధిదారులకు 330.15 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని   ఈ రోజు  పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ పధకంనకు  సంబంధించి  ఈ రోజు జిల్లాలో 3వ విడత కింద రజకులు, నాయీబ్రాహ్మణలు మరియు టైలర్స్  సంబంధించి 18,522 మంది లబ్దిదారులకు రూ.10,000/-లు చొప్పున 18.522 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందచేస్తున్నట్లు  మంత్రి తెలిపారు. జగనన్న చేదోడు పధకం కింద జిల్లాలో  మొత్తం మూడు విడతల్లో కలిపి 51 కోట్ల రూపాయల మేర ఆర్ధిక సహాయాన్ని అందచేయడం జరిగిందని మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, అన్నీ వర్గాల వారికి  అండగా  ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా అర్హత వుండి సాంకేతిక కారణాలతో సంక్షేమ పధకం అందకపోతే,  క్షేత్ర స్థాయిలో పరిశీలించి  వాటిని సవరించి సంక్షేమ పధకాలను అందించడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. 


తొలుత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్ర పటానికి మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.


1.  అన్నమేటి మల్లికార్జున, బార్బర్,  ఎన్.టి.ఆర్ నగర్, నెల్లూరు నగరం, జగనన్న చేదోడు  లబ్ధిదారులు: 

.................................


కులవృతిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు అండగా  నిలబడి వారి అభివృద్ధికి కృషి చేస్తానని   ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడు పధకం కింద  సంవత్సరానికి రూ.10,000/-ల చొప్పున 5 సంవత్సరాలపాటు మొత్తం రూ.50,000/-ల ఆర్ధిక సహాయం చేయుట ఎంతో సంతోషంగా వుందని, మాలాంటి పేద కుటుంబాలకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి జగనన్నకు మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మొత్తాన్ని  నా వ్యాపార అవసరాలకు వినియోగించడం జరుగుచున్నదని,  మా కుటుంబానికి విద్యా దీవెన పధకం కింద ఆర్ధిక సహాయం అందడం జరిగిందని, అలాగే ఇంటి స్థలం పట్టా కూడా మంజూరు కావడం జరిగిందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 


2.  మాచవరం రమేష్,, టైలర్, మంగళ వీధి,  కాపువీధి, నెల్లూరు నగరం, జగనన్న చేదోడు  లబ్ధిదారులు:

...........................

తన టైలరింగ్ వృతి  జీవితంలో అవసరమైన పెట్టుబడులకు కావలసిన నగదును అధిక వడ్డీలకు బయటి వ్యక్తులపై ఆధారపడకుండా ఆర్ధికంగా నిలదొక్కు కొనుటకు జగనన్న చేదోడు పధకం ఎంతో తోడ్పాటు కలిగిస్తున్నది. ఈ పధకం కింద  సంవత్సరానికి రూ.10,000/-ల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందచేయడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెల్పుతూ,   మాలాంటి వాళ్లకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.



Comments