ఆడాలి వ్యూ పాయింట్ వద్ద రిసార్ట్స్ నిర్మాణం



*ఆడాలి వ్యూ పాయింట్ వద్ద రిసార్ట్స్ నిర్మాణం


*


పార్వతీపురం/సీతంపేట, జనవరి 28 (ప్రజా అమరావతి): ఆడాలి వ్యూ పాయింట్ వద్ద రిసార్ట్స్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సీతంపేట ప్రాంతంలో శని వారం పర్యటించిన జిల్లా కలెక్టర్ వివిధ అభివృద్ధి పనులు పరిశీలించారు. సీతంపేటలో నిర్మిస్తున్న మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని, తదుపరి ఆడలి వ్యూ పాయింట్ ను సందర్శించారు. అడాలిలో రూ.2.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రిసార్ట్స్ ప్లాన్స్,  డ్రాయింగ్స్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి చెందారు. త్వరగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. జిల్లాలో మంచి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసి పర్యాటక ఆకర్షణకు నిలయంగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వన్ ధన్ వికాస్ కేంద్రాలు ద్వారా నిర్వహిస్తున్న జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి ఇలాంటి పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఉత్పత్తులకు విలువ ఆధారిత కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. మల్టీ స్పెషాలటీ ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. త్వరగా ఆసుపత్రి సేవలు గిరిజనులకు చేరువ కావాలని ఆయన పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఉత్తమ వైద్యానికి కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన అన్నారు. 


అనంతరం ఐటిడిఎ కార్యాలయంలో వివిధ శాఖలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పనుల ప్రగతి వేగవంతం కావాలని ఆదేశించారు. గృహ నిర్మాణాలు ఉగాది నాటికి గరిష్ఠంగా పూర్తి చేయాలని, లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయాలని ఆయన ఆదేశించారు. 


ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి. నవ్య, పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ పార్వతి, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ జి.మురళి, ఐటిడిఎ డిపిఓ సతీష్ కుమార్, టిపిఎంయు ఏపిఓ, మండల అధికారులు పాల్గొన్నారు.

Comments