స్మార్ట్ రోడ్ వై జంక్షన్ వద్ద రహదారి పనులు, కంబాల చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయండి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



స్మార్ట్ రోడ్  వై జంక్షన్ వద్ద రహదారి  పనులు, కంబాల చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయండి 




 క్షేత్ర స్థాయి లో పనులను కలెక్టర్, కమిషనర్ పరిశీలన



రాజమహేంద్రవరం లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.


మంగళవారం మధ్యాహ్నం కంబల చెరువు, స్మార్ట్ రోడ్ పనుల పురోగతిని కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత కంబాల చెరువు, వై జంక్షన్ నుంచి లాలాచేరువు వరకు చేపడుతున్న స్మార్ట్ రోడ్ పనులను క్షేత్ర స్థాయి లో పరిశీలించడం జరిగిందని తెలిపారు.  ఆయా పనులు 30 శాతం మేర పూర్తి అవ్వడం పై వివరణ కోరడం జరిగింది. ఆ పనులు త్వరితగతన పూర్తి చేసి, అప్పగించడం పై ఆశాభావం వ్యక్తం చేశారు. పై రెండు పనులను సుమారు రూ.20 కోట్ల తో అభివృద్ధి చేయడం జరుగుతుండగా, కాంట్రాక్ట్ నిర్ణీత సమయం లో పూర్తి చేయాల్సిన పనులు,  ఆమేరకు పురోగతి ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధుల మంజూరు కు సిద్దంగా ఉందని అన్నారు. క్షేత్ర స్థాయి లో చేపట్టిన అంచనాలు మేరకు పనులు టైం లైన్ లోగా పూర్తి చేయాలన్నారు. స్మార్ట్ రోడ్ పనులు రెండు వైపుల నుండి చేపట్టడం ద్వారా మరింత త్వరితగతిన పనులు చేయడం సాధ్యం అవుతుందని ఆ దిశలో చర్యకు ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు చేపట్టాలని సూచించారు.  అధికారులు వెండర్ ద్వారా పనులు వేగవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, కంబాల చెరువు, జీ ఎన్ టి స్మార్ట్ రోడ్ (వై జంక్షన్ నుంచి లాలచేరువు) లో జరుగుతున్న పనుల పురోగతిని కలెక్టర్ కు వివరించారు. ఆర్ ఎం సి యొక్క ప్రణాళికను కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఎస్ ఈ పాండురంగ రావు ఆయా పనుల పురోగతి పై వాస్తవ పరిస్థితిని వివరిచారు. 


కలెక్టర్ వెంట ఎస్ ఈ పాండురంగ రావు, ఆర్ ఎం సి అధికారులు కాంట్రాక్టర్ తదితరులు హాజరయ్యారు. 



Comments