గ్రామాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యం


నెల్లూరు, జనవరి  30 (ప్రజా అమరావతి): గ్రామాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యం


గా పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు. 


సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలోని బద్దెవోలు సచివాలయం పరిధిలో రెండో రోజు పల్లిపాలెం గిరిజన కాలనీలో  గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా   పర్యటించిన  మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.  ప్రతి గడపకు వెళ్ళిన మంత్రి ఆ కుటుంబ సభ్యులతో మమేకమవుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ గ్రామాల్లో  మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సంతృప్తికరస్థాయిలో అందజేస్తున్నామని చెప్పారు. పెద్ద ఎత్తున పింఛన్లు అందిస్తున్నామని, ఇటీవల పింఛను నిర్ధారణ కోసం నోటీసులు అందుకున్న వారిలో మరణించిన వారికి తప్ప ప్రతిఒక్కరికి అధికారులు పింఛను పునరుద్దరించారని పేర్కొన్నారు. ఒక సంవత్సరానికి సుమారు రూ 21 వేల కోట్లు పింఛన్ల పంపిణీకి ఖర్చు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ  వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. బద్దెవోలు గ్రామంలో పురాతన శివాలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు మొదలుపెట్టించామని, సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించినట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను చేపడుతూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 


ఈ కార్యక్రమంలో  బద్దెవోలు సర్పంచ్ ఉగ్గుమూడి శివకుమార్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాసిల్దార్ సుధీర్,  స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments