సమస్యలు తెలుసుకుని పరిష్కారం చెయ్యండి



 కొవ్వూరు (ప్రజా అమరావతి);




** లే అవుట్ లను పరిశీలించిన కలెక్టర్


*" సమస్యలు తెలుసుకుని పరిష్కారం చెయ్యండి



** ఇంటి నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలి



..  కలెక్టర్ డా. మాధవీలత


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసే దిశలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.


శనివారం స్థానిక కొవ్వూరు అర్బన్ ప్రాంతంలోని గూత్తా వారి చెరువు వద్ద ఉన్న జగనన్న కాలనీ లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 


ఈ సందర్భం గా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ,  లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా ఆయా లే అవుట్ ల వద్ద మౌలిక సదుపాయాలు, నీటి వసతి, రహదారి సదుపాయాల కల్పన గురించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి స్థలం లో ఇంకా ఎందుకు నిర్మాణానికి ముందుకు రావడం లేదో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు క్షేత్ర స్థాయి లో తగిన ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కేటాయించిన స్థలం సౌకర్యవంతంగా ఉందికదా అని ప్రశ్నించారు. మొత్తం ఎంత మంది లబ్దిదారుల కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయింపులు జరిగాయి వాటి వివరాలు తెలుసుకుని సూచనలు చెయ్యడం జరిగింది.


కలెక్టర్ వెంట ఆర్డీవో యస్. మల్లిబాబు, మునిసిపల్ ఛైర్ పర్సన్, భావన రత్నకుమారి, ఇంచార్జి జిల్లా హౌసింగ్ అధికారి జి. పరశురామ్,  తదితరులు ఉన్నారు. 



Comments