పారిశుద్ధ్య కార్మికులకు భోగి పర్వదినాన పాదాభివందనం

 రామచంద్రపురం

జనవరి 14 (ప్రజా అమరావతి);


*పారిశుద్ధ్య కార్మికులకు పాదపూజ చేసిన వెనుకబడిన తరగతుల సంక్షేమం సమాచార పౌర సంబంధాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ*


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం మున్సిపల్ ఆఫీస్ గాంధీ విగ్రహం వద్ద ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవా భావానికి  ప్రణామాలు అర్పిస్తూ ఘనంగా  రాష్ట్ర  బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సన్మానించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యర్ధాలను విడిచిపెట్టిన వాటిని శుభ్రం చేసి సమాజానికి స్వచ్ఛతను అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భోగి పర్వదినాన పాదాభివందనం


, రోగాన్ని తరిమికొట్టి ఆరోగ్యాన్ని అందించే సమాజానికి సేవాభావంతో పనిచేస్తున్న వైద్యులకు సంక్రాంతి వందనాలర్పిస్తూ,అసాంఘిక శక్తుల నుండి సమాజానికి రక్షణ కల్పిస్తూ స్వేచ్ఛ కోసం నిరంతరం తమ సుఖాలను ఆప్యాయతలను త్యాగం చేస్తూ స్వేచ్ఛను ప్రసాదిస్తున్న పోలీసు సిబ్బందికి సంక్రాంతి సత్కార సుమాలు అర్పిస్తూ గౌరవ శాల్యూట్  చేస్తున్నందుకు  మంత్రిగా గర్విస్తున్నానన్నారు.

అలాగే నిత్యం మనకు సేవ అందజేయడంలో ముందు నిలుస్తూ, మన కోసం తపిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు

.అనంతరం స్వచ్ఛతను అందిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, స్వేచ్ఛను కల్పిస్తున్న పోలీసులకు, మన ఆరోగ్యానికి సేవలందిస్తున్న డాక్టర్లు హాస్పిటల్ సిబ్బందికి పాదాలు కడిగి పూల హారాలు దుస్తాలతో సన్మానించి దుస్తులను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ గాదాం శెట్టి శ్రీదేవి,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments