*రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి
*
*: సంయుక్త కలెక్టర్ టీఎస్.చేతన్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జనవరి 03 (ప్రజా అమరావతి):
*రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ-సర్వే కార్యక్రమాన్ని సర్వే అధికారులు, సిబ్బంది పక్కాగా చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి.ఎస్. చేతన్ ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సర్వే అధికారులు, సిబ్బందితో సంయుక్త కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణ రీ -సర్వే, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో స్మశాన వాటికల స్థలాల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు.*
*అనంతరం సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద రీ - సర్వే కార్యక్రమాన్ని సర్వే అధికారులు, సిబ్బంది సమన్వయంగా పనిచేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే సమయంలో ఏవైనా సమస్యలు ఉన్నయెడల తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం పనులను వేగవంతం చేయాలన్నారు. రీ సర్వేకు సంబంధించిన ప్రతి పని జాగ్రత్తగా పరిశీలించి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 30 దాకా కొత్తగా ఓఆర్ఐ మ్యాపులకు సంబంధించి జరుగుతున్న సర్వే పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. భూ పంపిణీ సంబంధించి అసైన్డ్ సబ్ డివిజన్ ప్రక్రియ ప్రతిపాదనలపై దృష్టిని సారించాలన్నారు. ఈ సమావేశంలో సర్వే శాఖ ఎడి రామకృష్ణ, జిల్లా రీ సర్వే నోడల్ అధికారి శ్రీనివాసులు, డెప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, మండల సర్వేయర్లు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment