స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకుని గొప్ప లక్ష్యాల వైపు పయనించాలి



నెల్లూరు, జనవరి 12 (ప్రజా అమరావతి): అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకుని గొప్ప లక్ష్యాల వైపు పయనించాల


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

 మనుబోలు జడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఉదయం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా సేవానాదం ట్రస్ట్ అధ్యక్షులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్. ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా ఇటీవల యువతను ప్రోత్సహించే దిశగా సీఎం కప్ పోటీలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు చెప్పారు. మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంత అవసరమని, గెలుపుకు పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా ఎటువంటి ఆటుపోట్లనైనా తట్టుకొని నిలబడే ధైర్యం క్రీడలతో అలవడుతుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 39 ఏళ్ల వయసుకే ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు గడించిన స్వామి వివేకానంద బోధనలు ఆచరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రధానంగా యువత సన్మార్గంలో పయనించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

 అనంతరం ట్రోఫీని ఆవిష్కరించిన మంత్రి, బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను  ప్రారంభించారు.

 ఈ కార్యక్రమంలో సేవానాదం ట్రస్ట్ అధ్యక్షులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు వజ్రమ్మ, కోడూరు కల్పలత, మీరారెడ్డి, మునిగిరీష్, సేవానాదం ట్రస్ట్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 


Comments