ప్రజలతో పార్టీ క్యాడర్‌ మమేకం కావాలి.


అమరావతి (ప్రజా అమరావతి);


*విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ.*


*సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం.*


*వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*నియోజకవర్గ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*

నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం:

కార్యకర్తలను కలుసుకోవడం దీని వెనుకున్న ఉద్దేశం:

అంతేకాకుండా మరో 14–15 నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి:

గడపగడపకూ కార్యక్రమం ద్వారా మనం ప్రజల్లో మమేకం అవుతున్నాం:

ఎక్కడైనా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే వారికి కూడా మంచి జరగాలి:

దేవుడి దయతో మంచి పనులన్నీ చేయగలిగామని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ వివరించాలి:

వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి:

సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమింపచేస్తున్నాం:

పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తాం:

గృహసారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి:

ప్రజలతో పార్టీ క్యాడర్‌ మమేకం కావాలి:



ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్‌అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి:

అర్హులెవ్వరూ కూడా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం, గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు:

సంవత్సరంలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం:

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశాం:

ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం :

అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది :

కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80 శాతానికి పైగా క్లీన్‌ స్వీప్‌ చేయగలిగాం :


విజయవాడ ఈస్ట్‌లో కూడా 21 వార్డుల్లో 14 చోట్ల  గెలిచాం:

ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం :

మార్పు అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది:

దీనికి నిదర్శనమే కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు:

ఏమైనా సమస్యలు ఉంటే మనంలో మనం సర్దుబాటు చేసుకుందాం:

కచ్చితంగా 175 కి 175 సీట్లు గెలవాలి:

అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది:

వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా..  ప్రతి ఇంట్లోకూడా సంతోషం కనిపిస్తోంది:

మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి, చదువులు మారుతున్నాయి, ఆస్పత్రులు మారుతున్నాయి:

ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది:

ఇంత మార్పు అన్నది ఎప్పుడూ కూడా జరగలేదు:

వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా పూర్తిస్థాయిలో వస్తుంది:

విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇస్తాయి:

కాబట్టి ఈ ఎన్నికలకు మనం అంతా కలిసి కట్టుగా పనిచేయాలి:

ఎలాంటి విభేదాలున్నా పక్కనపెట్టాలి:

ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి:

ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం:

30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం:

నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను:

మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒకరికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి:

ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి:

మనకు ఓటు వేయని వారి ఇళ్ళకు కూడా మనం వెళ్లాలి :

చేసిన మంచిని వారికి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది :

మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది :

అందుకనే ప్రతి ఇంటికీ వెళ్లాలి... అందరి ఆశీర్వాదాలు కావాలి.

మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి:

 కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన సీఎం. 


ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైయస్సార్సీపీ ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Comments