స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రొగ్రామ్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా (ప్రజా అమరావతి);



*స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రొగ్రామ్ అమలులో 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు


*•* హర్షం వ్యక్తం చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పాఠశాల ఆరోగ్యం మరియు సంక్షేమ కార్యక్రమానికి (స్కూల్ హెల్త్ అండ్ వెల్ నెస్ ప్రొగ్రామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కడం హర్షణీయమని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

డిల్లీలో ఈ నెల 16,17 తేదీల్లో జరిగిన 2వ జాతీయ వర్క్ షాపులో ఆంధ్రప్రదేశ్ తరఫున స్కూల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్, పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు (ఎస్సీఈఆర్టీ) నోడల్ ఆఫీసర్  P హేమరాణి ఈ పురస్కారాన్ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ రోలీ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. 


ఈ కార్యక్రమం గురించి.. 

2020 ఫిబ్రవరి 24న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో ఆగస్టు 2020 నుంచి ఎస్సీఈఆర్టీ, డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంయుక్తంగా యూనిసెఫ్ సాంకేతిక సాయంతో అమలు చేయబడింది. 

కర్నూలు జిల్లాతో పాటు ఆకాంక్షత్మక జిల్లాలైన కడప, విజయనగరం, విశాఖపట్నాలలో  ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాలనుకుని... పాఠశాల విద్యాశాఖ కమీషనర్, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్లు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ గురుకులాల్లో అమలు జరిగేలా పూనుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది స్టేట్ రిసోర్సు గ్రూపులు ఆన్ లైన్ ద్వారా జాతీయ స్థాయి శిక్షణ పొందారు.

ఇందులో భాగంగా 11 SHWP మాడ్యూళ్లను అనువదించారు.

వీడియోలు, లఘుచిత్రాలు, నాటికలు అభివృద్ధి చేయబడ్డాయి.

ఫిబ్రవరి - 2021లో SCERT ద్వారా జిల్లా స్థాయి రిసోర్స్ గ్రూప్ శిక్షణ పొందారు. బయోమెట్రిక్ హాజరుతో MRCలలో 3 రోజుల పాటు జిల్లా స్థాయిలో (ఒక్కో పాఠశాల నుండి 1 HM మరియు ఇద్దరు  ఉపాధ్యాయులు) మొత్తం 32,000 మంది ఆరోగ్యం మరియు వెల్నెస్ అంబాసిడర్లుగా శిక్షణ పొందారు.

మార్చి - 2021లో పాఠశాల స్థాయి కార్యక్రమం నిర్వహించబడింది. అన్ని పాఠశాలల్లో మొత్తం 21,14,152 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.

అమలు చేస్తున్న పాఠశాలలు

10,932 ప్రభుత్వ ఎయిడెడ్, UP మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు (6వ తరగతి నుండి 12వ తరగతి వరకు)

164 మోడల్ స్కూల్స్

352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVలు)

96 వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమ పాఠశాలలు

192 షెడ్యూల్డ్ కులాల (SC) సంక్షేమ పాఠశాలలు

747 గిరిజన సంక్షేమ పాఠశాలలు

50 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలు.

Comments