మాంజా అమ్మేవారు, మాంజా వాడే గాలిపటాలు ఎగరేసే వారిపైకఠిన చర్యలు తప్పవు

 రామగుండం పోలీస్ కమిషనరేట్ (ప్రజా అమరావతి);
*మాంజా అమ్మేవారు, మాంజా వాడే గాలిపటాలు ఎగరేసే వారిపైకఠిన చర్యలు తప్పవు


*


*మంచిర్యాల పోలీస్ ఆధ్వర్యంలో 0పట్టణం లోని షాప్ లలో మంజా అమ్మకాలపై ఆకస్మిక తనిఖీ లు*


 ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు  మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని పతంగులు మరియు దానికి సంబంధించిన దారాలు అమ్మే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ.... గాలిపటాల తయారీదారులు, అమ్మకందారులతో పాటు పిల్లలు మరియు యువకులు గాలిపటాలు ఎగురవేయడానికి మాంజాను ఉపయోగించవద్దని హెచ్చరించారు. తమ పిల్లలు మాంజా వాడకుండా ఆపాలని తల్లిదండ్రులను కోరుతూ, లేకుంటే చర్యలు తీసుకోబడతాయి అని గాలిపటాల కోసం మాంజాను ఉపయోగించడం లేదా విక్రయించడంలో పాలుపంచుకున్న వారి గురించి ప్రజలు పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడతాయని మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ ప్రజలను కోరారు. అలాగే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు చర్యలో భాగంగా దుకాణం యజమాలను బైండోవర్ కూడా చేయడం జరుగుతుందని సిఐ గారు తెలిపారు.

Comments