రావి ఆధ్వర్యంలో "టీడీపీ శ్రేణుల" సంక్రాంతి సంబరాలు

 *- రావి ఆధ్వర్యంలో "టీడీపీ శ్రేణుల" సంక్రాంతి సంబరాలు*


 

 *- "సైకో పోవాలి సైకిల్ రావాలి" అంటూ నినాదాలు* 

 *- భోగిమంటల్లో పలు ప్రభుత్వ జీవో కాపీల దగ్ధం* 

 *- ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపిన రావి*


గుడివాడ, జనవరి 14 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులంతా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే రావి ఈ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1తో పాటు పలు జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.

"సైకో పోవాలి సైకిల్ రావాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రావి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రావి మాట్లాడుతూ తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారన్నారు. తొలి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమను కుటుంబమంతా కలిసి సందడిగా జరుపుకుంటారని చెప్పారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవోలను తీసుకువస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే జీవో నెంబర్ 1 విడుదల చేసి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. అటువంటి జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగలబెట్టామని తెలిపారు. వైసిపి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేకంగానే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు సైకో పోవాలి సైకిల్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రావి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యార్లగడ్డ సుధారాణి, పోలాసి ఉమామహేశ్వరరావు, సునీత, సర్కార్, వసంతవాడ దుర్గారావు, ముళ్లపూడి రమేష్ చౌదరి, మజ్జాడ నాగరాజు, షరీఫ్, నెరసు కాశి, జబీన్, సింగవరపు ప్రభాకర్, మెరుగుమాల బ్రహ్మయ్య, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments