సమాజంలోని ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయక అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న ఏకైక ప్రభుత్వం తమది


నెల్లూరు  జనవరి 31 (ప్రజా అమరావతి)!


సమాజంలోని ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయక అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న ఏకైక ప్రభుత్వం తమద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.


మంగళవారం సాయంత్రం వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి కాకాణి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ ఫలాల లబ్ధిని తెలిపే బుక్ లెట్ ను అందిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని తెలియజేస్తూ, సాంకేతిక లోపాలతో అందనివారికి అందించటమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ తదనుగుణంగా పూర్తి చేస్తున్నామన్నారు. ప్రజలు వారి వారి గ్రామాలను దాటకుండానే వారికి కావలసిన అన్ని సదుపాయాలను సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా నేరుగా వారి గుమ్మం వద్దకే తీసుకొచ్చామన్నారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని అక్కున చేర్చుకుని ఆదరించి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు.  చవటపాలెం గ్రామంలోని ఎస్ సి, ఎస్ టి కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ఎంపీడీవోను ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందా కవిత,   ఎంపీడీవో సుస్మిత, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.



Comments