ఫిబ్రవరి లోగా కార్మిక సభ్యత్వ నమోదును పూర్తి చేయండి:రాష్ట్ర కార్మికమంత్రి జయరాం

 ఫిబ్రవరి లోగా కార్మిక సభ్యత్వ నమోదును పూర్తి చేయండి:రాష్ట్ర కార్మికమంత్రి జయరాం 


అమరావతి,20 జనవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు లోగా కార్మిక సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు గుమ్మనూరు జయరాం అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులోని మంత్రి వర్యుల చాంబరులో వైయస్ఆర్ బీమా,లేబర్ సెస్ అంశాలపై ఆయన కార్మికశాఖ,బీమా సంస్థల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కార్మికునికి  లబ్ధి చేకూర్చే విధముగా కార్మికశాఖ అధికారులు పని చెయ్యాలని ఆదేశించారు.రాష్ట్రంలో వైయస్ఆర్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వము సహకారం లేకుండా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఫిబ్రవరి లోగా వైయస్సార్ బీమా కింద పెండింగ్లో ఉన్న 262 ధరఖాస్తులను క్లియర్ చేయాలని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కార్మికశాఖ అధికారులను ఆదేశించారు.అదే విధంగా కార్మిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా  ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.వైయస్ఆర్ బీమా బాధితులకు నియమిత కాలంలో బీమా క్లెయిమ్లు చెల్లించవలసిందిగా బీమా సంస్థల అధికారులను మంత్రి జయరాం కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ యం.యం నాయక్,గ్రామ వార్డు సచివాలయాల జాయింట్ డైరెక్టర్ వికాస్,అదనపు లేబర్ కమిషనర్ లక్ష్మీ నారాయణ, సంయుక్త లేబర్ కమీషనర్లు రామారావు,రాణి,బాలు నాయక్,శ్రీనివాస్,ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు,పలువురు అధికారులు పాల్గొన్నారు.

      

Comments