మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంద
ని జీడబ్ల్యూటీసీఎస్ పూర్వ అధ్యక్షురాలు, తెలుగు మహిళ ప్రాంతీయ కోఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు అన్నారు. అమెరికాలోని వాషింగ్జన్ డీసీలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సాయిసుధ పాలడుగు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను పోగొట్టి పురుషులతో పాటు అన్నిరంగాల్లో సమానంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. నా తెలుగింటి ఆడపడుచులంటూ ఎంతో వాత్సల్యాన్ని చూపేవారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజ్యాధికార కట్టబెట్టారు. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. తెలుగుజాతికి ఆత్మగౌరవం ఎన్టీఆర్ ఇస్తే.. ఆత్మవిశ్వాసం చంద్రబాబు ఇచ్చారు. ఎన్టీఆర్ భావావేశాన్ని, భావజాలాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. యూఎస్ లో మహిళలు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పనిఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కోసం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ద్వారానే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించినవారం అవుతాము.
రిటైర్డ్ ప్రిన్సిపల్ షకీరా బేగం మాట్లాడుతూ.. మహిళలు ఉన్నత విద్య అభ్యసించేందుకు పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అక్షరసేద్యంతో తెలుగుభాషను సుసంపన్నం చేశారు. మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచిచూపించారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి సాహితీజగత్తును శాసించారు.
ఈ కార్యక్రమంలో అనిత మన్నవ, శ్రీలత నార్ల, పద్మజ బేవర, తనూజ యలమంచలి, శిరీష నర్రా, అపర్ణ వీరమాచినేని, కరిష్మ కొంగర, శాంతి పరిముపల్లి, ప్రణీత కంతు, శ్వేత కావూరి, వల్లి కుర్రే, పద్మ కోడె, మల్లి నన్నపనేని, రాధి కొట్నూరు, సుష్మ అమృతలూరి, దుర్గ చలసాని, కార్జల్ అచలసాని, స్వప్న, స్వర్ణ కమల్, రోహిత తన్నీరు, రమాదేవి మన్నవ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment