దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధినేత



*నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అధినేత*



*ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్.1 ను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపిన టీడీపీ అధినేత, నేతలు*


*టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం:-*


సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ

ఈ రోజు ఘనంగా భోగి పండుగ చేసుకున్నాం.

ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను భోగిమంటల్లో వేసి కాల్చాం. సైకో పాలన పోవాలని ఈ సందర్భంగా కోరుకున్నాం.

తెలుగుప్రజల జీవితాలను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు...తరువాత అని చూడాలి.

తెలుగు రాష్ట్రాన్ని సాధించి పెట్టింది పొట్టి శ్రీరాములు అయితే....వారికి గౌరవం తెచ్చిపెట్టింది ఎన్టీఆర్.

స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు అయ్యింది....మన భారతదేశ గొప్ప సంపద యువత.

ఈ రోజు యువత ఎంతో ఉత్సాహంతో...భవిష్యత్ పై ఆలోచనతో ఉన్నారు. 

నేను నాడు ప్రోత్సహించిన ఐటి సెక్టార్ ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. ఐటి అవకాశాన్ని తెలుగు యువత అందిపుచ్చుకున్నారు.

తెలుగు సినిమా కు ఇండియాలో ఎంత ఆదాయం వస్తుందో....ఓవర్సీస్ లో అంత ఆదాయం వస్తోందంటే మన వాళ్లు ఎంత విస్తరించారో అర్థం చేసుకోవాలి.

కొందరు నేటి కోసం బతుకు తారు..మరికొందరు రేపటి కోసం బతుకుతారు...కానీ నేను మీ భవిష్యత్ కోసం బతుకుతాను.

ఇవన్నీ గుర్తించే జీ 20 చర్చల సందర్భంగా ప్రధానికి ఒక సూచన చేశాను....2047వరకు ఒక విజన్ సిద్దం చేసుకోవాలని కోరాను.

రానున్న 25 ఏళ్లకు విజన్ సిద్దం చేసుకుని ప్రయాణం చెయ్యాలని ప్రధానికి సూచించాను

నాడు జనభా నియంత్రణ పద్దతులను ప్రోత్సహించాను. దీన్ని జనం స్వీకరించారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పనిచేస్తున్నారు....ఒక్కరినే కంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలి. అప్పుడే దేశంలో యువత నిష్ఫత్తి సరితూగుతుంది.

నేను పుట్టినప్పుడు మా ఊళ్లో చిన్న రోడ్డు లేదు...కనీసం కరెంట్ లేదు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని నాడు వాజ్ పేయికి నేషనల్ హైవేస్ ప్రాజెక్టును తీసుకువచ్చాం.

నాటి సంస్కరణల్లో భాగంగానే, నా చొరవతోనే అద్భుతమైన హైవే రోడ్లు వచ్చాయి. అయితే రాష్ట్ర రహదారులు మాత్రం దారుణంగా ఉన్నాయి. రాష్ట్ర రోడ్లపై తిరిగి నాకూ నడుం నొప్పి వచ్చింది. కానీ ప్రజా సమస్యలపై తిరగాల్సిందే.

నేడు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభం అయ్యింది. సైకో పాలనతో అన్ని వర్గాలు నష్టపోయాయి.

దేశంలో ఎక్కువ పెట్రో ధరలు, ఎక్కువ కరెంట్ చార్జీలు, ఎక్కువ నిత్యావసర వస్తువులు, ఎక్కువ ఇంటి పన్ను, చెత్త పన్ను ఉన్న రాష్ట్రం మన రాష్ట్రమే.

సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ధనికులే కాదు...పేద వాళ్లు కూడా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంలో సంక్షేమానికి నాంది పలికింది నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం. రెండు రూపాయలకే కెజీ బియ్యం, రూ.50లకే హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్తాలు వంటి పథకాలు తెచ్చింది టిడిపినే. 

మహిళల కోసం ఆస్థిలో సమాన హక్కు ఇవ్వడంతో పాటు...వారి కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్.

వంటింటికే పరిమితం అయిన ఆడవాళ్లను ఉద్యోగాల వైపు పంపింది నేనే. మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం కల్పించింది టిడిపి ప్రభుత్వం.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా హితం కోసం పని చేసింది. నాడు జన్మభూమి కార్యక్రమం పెట్టి గ్రామాల అభివృద్దిని ప్రోత్సహించాం.

ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారిని గ్రామాలకు రప్పించి అభివృద్దిలో భాగస్వాముల్ని చేశాం.

నాడు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా నా సతీమణి భువనేశ్వరి నారా వారి పల్లె వెళ్లే కార్యక్రమం తలపెట్టారు. 23 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది సొంత ఊరు వచ్చి మేము కూడా సొంత ఊళ్లో పండుగ చేసుకుంటున్నాం.

ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే విధంగా మారిపోయింది.

అవేదనతో, భాధతో పెద్ద ఎత్తున మహిళలు యువత ఇదేం ఖర్మ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. 

తమ బిడ్డల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు చాలా ఆవేదన  చెందుతున్నారు. ప్రభుత్వాలు మీ బిడ్డల భవిష్యత్ ను తీర్చిదిద్దేలా, అవకాశాలు కల్పించే పాలన చెయ్యాలి.

కానీ ఈ ప్రభుత్వం తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ప్రశ్నించిన నాపైనా కేసులు పెడుతోంది. నన్ను అడ్డుకుంటోంది. నా సభలకు బందోబస్తు కూడా ఇవ్వడం లేదు. 

కందుకూరు ప్రమాదానికి కారణం భద్రత ఇవ్వకుండా ప్రభుత్వం చేసిన కుట్ర.

నాటి సభకు ఎందుకు పోలీసులను భద్రతగా పంపలేదు..? ఇది కుట్ర కాదా?

గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట కూడా కుట్రలో భాగమే. 

ఇవన్నీ చూపించి...జీవో నెంబర్ 1 తీసుకువచ్చారు. మేం ప్రజలను కలవకూడదని ఆంక్షలు పెట్టాడు.

నేను ప్రజలను కలవకూడదు అని జగన్ భావించాడు. నాకు జగన్ పై ఎటువంటి ద్వేషం లేదు. జగన్ తండ్రి వైఎస్ ఆర్ నాకు మంచి స్నేహితుడు.

నేను, వైఎస్ఆర్ 1978లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లాం. నాకు వైఎస్ తో మంచి అనుబంధం ఉండేది.

నేడు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈ పాలనతో నష్టపోయారు. ఇసుక ఎందుకు దొరకడం లేదు.? దీని వల్ల నిర్మాణ రంగంపై ఎంత ప్రభావం పడింది.? ఆయా వృత్తుల వారు ఎంత నష్టపోయారనేది ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు

బిసి, ఎస్సి, ఎస్టీలకు పథకాలన్నీ రద్దు చేశారు. దీంతో ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి.

జగన్ పాలనతో ఎపి బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా సంస్థ ఎందుకు వెళ్లిపోయింది.?

చిత్తూరు ప్రజల రుణం తీర్చుకోవడానికి పెట్టిన అమర్ రాజా ఫ్యాక్టరీని పంపేశారు. ఫ్యాక్టరీలో పొల్యూషన్ అనే ఆరోపణలతో సంస్థను తెలంగాణకు పంపారు.

జగన్ రెడ్డి, అతని సైకోల కారణంగా ప్రజలు ఆస్తులు కోల్పోతున్నారు. ప్రజల మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు. 

రాష్ట్రంలో నాణ్యతలేని మద్యం ఎందుకు తాగాల్సి వస్తోంది.? దీని వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. మహిళల మంగళసూత్రాలు తెంచే మద్యం అమ్ముతన్న ప్రభుత్వమిది.

పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై 40 రోజుల్లో 10 కేసులు పెట్టారు. కార్యకర్తలను పండగపూట జైల్లో పెట్టారు. దీనికి పెద్దిరెడ్డి తప్పక అనుభవిస్తాడు. గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డి.

దుర్మార్గాలు చేస్తున్న ప్రతి ఒక్కరి లెక్కలు రాసి పెడుతున్నా....ఈ సంక్రాంతి సందర్భంగా చెపుతున్నా.....ఇంతకు ఇంతా చేద్దాం.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు  పెట్టినా సైకో పాలన పోవడం ఖాయం.

మద్యంతర ఎన్నికలు వస్తే ముందే ఈ ప్రభుత్వం పోతుంది.

వచ్చే ఎన్నికలు టిడిపికి వైసిపికి మధ్య కాదు. 5 కోట్ల ప్రజలకు...సైకో జగన్ రెడ్డికి మద్య జరగనున్నాయి.

పోలీసులకు కూడా జరుగుతున్న తప్పు తెలుసు కానీ....కొందరు పోలీసులు తప్పులు చేస్తూనే ఉన్నారు.

అధికార పార్టీలో నాగభూషణం, రాజనాల కంటే పెద్ద విలన్లు మనం రాష్ట్రంలో చూస్తున్నాం.

సంక్రాంతి రోజు రైతాంగం సంతోషంగా లేదు. మద్దతు ధర లేక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.

మనం ప్రశ్నిస్తుంటే జగన్ బయటకు వచ్చి తనకు మీడిమా లేదు అంటున్నాడు. సాక్షి మీడియా ఎవడి ఛానల్? బ్లూ మీడియా ఏం చేస్తోంది.?

రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం కూడా సంతోషంగా లేదు. వారిలో కొందరికి పదవులు తప్ప వాళ్లూ నష్టపోయారు.

నేడు తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

తిరుమల కొండపై అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అద్దెగదుల రేట్లు, ప్రసాదం రేట్లు పెంచేశారు. వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెట్టిన వ్యక్తి ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు.

కులాల మద్య, ప్రాంతాల మధ్య కుట్ర పెట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పుడు రాయలసీమ అంటున్న జగన్....రాయలసీమకు ఏం చేశాడు.? రాయలసీమకు న్యాయం చేసే బాధ్యత సీమబిడ్డగా నేను తీసుకుంటా.

టిడిపికి అండగా ఉండే, వెనుక బడిన వర్గాలు ఉండే ఉత్తరాంధ్రను అభివృద్ది చేసింది..చేసేది టిడిపినే.

పండుగకు గ్రామాలకు వచ్చిన ప్రజలంతా నేను చెప్పిన అంశాలపై చర్చించుకోండి.

నేను నాకోసం పోరాడడం లేదు....రాష్ట్రం కోసం పోరాడుతున్నాను.

నా బాధ్యతగా నేను పోరాటం చేస్తాను...ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించాలి.

నా జీవితంలో ఇంత దారుణమైన సిఎంను ఎప్పుడూ చూడలేదు. నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే సైకోలు ఆయన మీద పడి దాడి చేస్తున్నారు.

కుక్కల్లా వైసిపి నాయకులు పవణ్ కళ్యాన్ పై దాడి చేస్తున్నారు. సభ్యత లేకుండా విమర్శలు చేస్తున్నారు.

ఈ సైకోలు అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏడాది తరువాత ఇక్కడ ఉంటారా...పారిపోతారా అని.

భూభాగంలో ఎక్కడ ఉన్నా... పారిపోయినా ఈ సైకోలను తీసుకువచ్చి శిక్షిస్తా.

బాబాయి హత్య, కోడి కత్తి దాడిపై జగన్ ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. 

రాష్ట్రంలో కంప్యూటరైజేషన్ పేరుతో ప్రజల భూములు కొట్టేస్తున్నారు. 

ప్రజల భూములను నిషేధిత భూముల జాబితాలో పెడుతున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పైగా రైతులు స్వాగతిస్తున్నారు అని అసత్య ప్రచారం చేస్తున్నారు

చిత్తూరు జిల్లాకు పట్టిన శనిలా పెద్దిరెడ్డి మారిపోయాడు. రాజకీయాల్లో ఉండేందుకు జగన్ రెడ్డికి అర్హత లేదు.

జగన్ రెడ్డికి పోలీసులు ఉంటే...నాకు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.

నేను పోరాడేది నా కోసం కాదు...నా తెలుగు రాష్ట్ర ప్రజల కోసం.

Comments