*తెలుగుదేశం గెలుపే లక్ష్యంగా పని చేయండి ;
పార్థసారథి గారికి టీడిపి అధినేత చంద్రబాబు దిశానిర్దేశం*
వన్ టూ వన్ కార్యక్రమంలో భాగంగా అధినేత నారాచంద్రబాబునాయుడు గారితో సమావేశం అయిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బికె. పార్థసారథి.
రానున్న ఎన్నికల్లో పెనుకొండ కోట పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడానికి అన్ని విధాల సమాయత్తం కావాలని పార్థసారథి గారికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇంచార్జిలతో వన్ టూ వన్ కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడలోని చంద్రబాబు నివాసంలో పార్థసారథి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను బికె. పార్థసారథి ఆయన అంశాల వారీగా వివరించారు. మరియు ప్రస్తుతం జరుగుతున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో వస్తున్న స్పందనకు సంబందించిన అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కు పార్థసారథి గారు వివరించారు.
రానున్న ఎన్నికల సమయం చాలా కీలకమైనది , అవి ఎప్పుడు వచ్చినా సరే ఎదుర్కొనే కార్యకర్తలను సంసిద్ధం కావాలని చంద్రబాబు పేర్కొన్నారు.నియోజకవర్గంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు.
ఎన్నికల సమరం ఉందనే విధంగా గ్రామాల్లో ప్రజల సమస్యలపై దృష్టి సారించి పోరాటం చేయాలని ఆయన పార్థసారథికి సూచించారు.
addComments
Post a Comment