XII వ గ్రూప్ సమావేశాలు పొగాకు పై అఖిల భారత పొగాకు నెట్వర్క్ ప్రాజెక్ట్ (AINPT)



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



రెండవ రోజు  కార్యక్రమం


XII వ గ్రూప్ సమావేశాలు  పొగాకు పై అఖిల భారత పొగాకు నెట్వర్క్ ప్రాజెక్ట్ (AINPT)

(భారత  వ్యవసాయ పరిశోధనా మండలి)


స్థానిక  కేంద్ర పొగాకు పరిశోధనా  సంస్థ  (CTRI) లో  నిర్వహించబడుతున్న  అఖిల భారత పొగాకు నెట్ వర్క్  ప్రాజెక్టు  XII గ్రూపు  సమావేశాల  రెండవ రోజు శనివారం (28. 01. 2023) కార్యక్రమంలో  క్షేత్ర సందర్శనను  నిర్వహించారు. 


 ICAR-CTRI నల్లరేగడి నేల  పరిశోధనా క్షేత్రం  (కాతేరు )ను  డా.  తిలక్ రాజ్  శర్మ , డిప్యూటీ డైరెక్టర్ జనరల్ , భారత  వ్యవసాయ  పరిశోధనా మండలి (ICAR) న్యూఢిల్లీ ; డా.  R.K.సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, ICAR, న్యూఢిల్లీ; Dr. M. శేషు మాధవ్, డైరెక్టర్, సి .టి .ఆర్ .ఐ, తదితర శాస్త్రవేత్తలు  సందర్శించారు . ICAR-CTRI ద్వారా మెరుగైన ప్రజనన శక్తి కలిగిన పొగాకు రకాలు అభివృద్ధి, తక్కువ నికోటిన్ కలిగిన రకాలను అభివృద్ధి చేయడం, పొగాకు క్యూరింగ్ పద్దతిలో సౌర శక్తిని ఉపయోగించి ఇంధనం గా వాడి కలప వినియోగాన్ని తగ్గించి పొగాకు సాగు మరియు కోత అనంతరం యాజమాన్యంలో ఖర్చును తగ్గించుకొని పొగాకును లాభసాటి సాగుగా చేపట్టాలని సూచించారు. పొగాకు రకాల సాగు, మిరప పంట సస్య రక్షణ పద్ధతులు, పొగాకు క్యూరింగ్ బ్యారన్లు డా. టి ఆర్. శర్మ తదితరులు పరిశీలించి శ్యాస్త్రవేత్తలకు తగిన సూచనలు ఇచ్చారు.


పొగాకులో లాభసాటి ఎగుమతులు , వాణిక్యం మరియు ట్రేడ్ తో CTRI అనుసంధాన కార్యాచరణ  పై  ముఖాముఖి  చర్చ నిర్వహించబడింది . ఈ సందర్బంగా డాక్టర్ . ఏ.శ్రీధరబాబు , ఎక్సిక్యూటివ్  డైరెక్టర్ ,పొగాకు బోర్డు  సభను  ఉద్దేశించి   మాట్లాడుతూ  భారత  పొగాకు  గణాంకాలు మరియు ప్రపంచ FCV  పొగాకు ఉత్పత్తి  క్షీణిస్తున్న  తరుణంలో ICAR-CTRI, Tobacco Board మరియు  Trade  పరస్పర అవగాహనా,  అనుసంధానం తో పనిచేసి ప్రపంచ పొగాకు వాణిజ్యం లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.



Dr. M. శేషు మాధవ్ డైరెక్టర్, సి .టి .ఆర్ .ఐ మాట్లాడుతూ పొగాకు బోర్డు, మరియు ఇతర పొగాకు వాణిజ్య సంస్థల సహకారంతో పునస్థీకరించి  (reoriented) పరిశోధన పద్దతులను చేపడతామని తెలిపారు.  


డా.  R.K.సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్  మాట్లాడుతూ ప్రధానం గా  పరిశోధనలు PPP (Public Private Partnership) పద్దతిగా చేపడితే ఫలితాలు వేగవంతంగా విడుదల అవ్వడానికి వీలవుతుందని తెలిపారు. 


డా. టి ఆర్. శర్మ మాట్లాడుతూ ICAR-CTRI నిర్వహించిన ఈ  సమావేశం శ్యాస్త్రవేత్తలకు, వాణిజ్యశ్రేణులకు, రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచాయని హర్షాన్ని వ్యక్తం చేసారు. 


AINPT 12వ గ్రూపు  సమావేశాల ముగింపు  కార్యక్రమంలో  పొగాకు రైతు  ప్రయోజనార్థం  ఈ  క్రింది  మూడు  అంశాలను  సిఫార్సు  చేయడం జరిగింది .



కర్ణాటక  తేలికపాటి  నేలల FCV  పొగాకు  దిగుబడి  మెరుగుదల  కోసం పంట అవశేషాల రక్షక కవచంగా పోక చెక్క పొట్టు (Areca) పొడిని ఉపయోగించడం, రబీ లో ఆవ  లేదా వేసవిలో జనుము  పంటలను పెంచి దుక్కి లో దున్నడం ద్వారా వేరు పురుగును (నులి పురుగు ) సమర్థవంతంగా నివారించుకోవడం తమిళనాడు లో పండించబడే  నమిలే రకాల పొగాకు (chewing tobacco) నాణ్యతను ను మెరుగుపరచడానికి కొబ్బరి గుజ్జు (Mesocarp) లేదా అరటి బొంద లేదా అరటి గెల మొదలు (Peduncle) మరియు  తాటి బెల్లం ద్రావణాల మిశ్రమాన్ని  వినియోగించడం పై ఈ సందర్భంగా ఈ క్రింది  5 ప్రచురణలను ప్రముఖులు విడుదల చేశారు.



డివిజన్  ఆఫ్  క్రాప్   ఇంప్రూవ్మెంట్  – టెక్నికల్  బులెటిన్ స్టేటస్  పేపర్  ఆన్  ఇండియన్  ఎఫ్ సి వి  టొబాకో హై -వేల్యూ  కమర్షియల్  క్రాప్స్  ఇన్  ఇండియా,  ప్రెజెంట్  స్టేటస్  అండ్  ప్రాస్పెక్టస్  ఫర్  ఆగమెంటింగ్  ప్రొడక్టివిటీ, ఖ్యాలిటీ, వేల్యూ  అడిషన్ అండ్  ఎక్సపోర్ట్స్  కెవికె  ఎట్  ఏ గ్లాన్స్   - బ్రోచుర్

CD: సక్సెస్  స్టోరీ  ఆన్  కోయిర్  యార్న్  ఎంట్రెప్రినేటర్



ఈ సెషన్‌లో AINPT కింద ఉన్న అన్ని పరిశోధన కార్యక్రమాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. తదుపరి సాంకేతిక కార్యక్రమం యొక్క భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు.

సెషన్స్ పూర్తయిన తదుపరి సంస్థలోని పరిశోధనా ప్రయోగశాలలను సందర్శించారు.





Comments