ఎం డి యు ఆపరేటర్లకు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల)వాహనమిత్ర పథకం కింద రూ.10 వేలు

 ఎం డి యు ఆపరేటర్లకు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల)వాహనమిత్ర పథకం కింద రూ.10 వేలు

అమరావతి, ఫిబ్రవరి 25 (ప్రజా అమరావతి);  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తోన్న (ఎండియు) మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లకు బీమా ప్రీమియంను ఈ ఏడాది నుంచి వాహనమిత్ర పథకంలో భాగంగా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎండియు ఆపరేటర్ల విజ్ఞప్తి మేరకు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు.తమకు వచ్చే వేతనం నుంచి ఎం డి యు వాహనాల ప్రీమియంను ప్రతి ఏడాది బ్యాంకులు జమ చేసుకోవడంతో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండియు ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో మంత్రి కారుమూరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. అయితే  ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021నుంచి అమలు చేయాల్సిందిగా సిఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జూలై లో సొంత గా ఆటో,ట్యాక్సీలు నిర్వహించుకునే వారికి చెల్లించే వాహనమిత్ర పథకంతో ఎండియు ఆపరేటర్లకు ప్రీమియం తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది.


Comments