ఏప్రిల్ 15 నాటికి గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తి చేస్తాం

 *ఏప్రిల్ 15 నాటికి గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తి చేస్తాం


*


*: సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 23 (ప్రజా అమరావతి):


వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో రీసర్వే చేపట్టిన గ్రామాల్లో ఏప్రిల్ 15 నాటికి గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ వివరించారు.


గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం, రీసర్వే, మ్యుటేషన్స్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ టిఎస్. చేతన్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జిల్లాలో మొదట విడత కింద 26 గ్రామాల్లో, రెండవ విడత కింద 29 గ్రామాల్లో రీసర్వే చేపట్టడం జరిగిందని, ఆయా గ్రామాల్లో ఏప్రిల్ 15 నాటికి గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను అధిగమించి రీ సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా చూస్తామన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి రీ సర్వే చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ చేపట్టేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.


ఈ సందర్భంగా సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ రీసర్వే చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నిర్దేశించిన గడువులోగా గ్రౌండ్ టు థింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రౌండ్ టు థింగ్ తరువాత వెట్రైజేషన్, విలేజ్ సర్వేయర్, విఆర్ఓ లాగిన్ లో డేటా ఎంట్రీ సకాలంలో చేయాలన్నారు. స్టోన్స్ ప్లాంటేషన్ కూడా పూర్తి చేసేలా చూడాలన్నారు. త్వరితగతిన రీ సర్వేలో అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేయాలన్నారు.


ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఐఓఎస్ లు కృపాకర్, శాంతరాజ్, డిఐఓలు నరేంద్ర, శామ్యూల్, చంద్రశేఖర్, చిట్టిబాబు, అంజలీదేవి, మోహన్, మురళీ, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Comments