జిల్లాలో రైతు భరోసా - పీఎం కిసాన్ కింద అర్హులైన 2.68 లక్షల మంది రైతులకు రూ.56.54 కోట్ల పంపిణీ

 *డా.వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడవ విడత నగదు పంపిణీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ ప్రారంభం*


*: జిల్లాలో రైతు భరోసా - పీఎం కిసాన్ కింద అర్హులైన 2.68 లక్షల మంది రైతులకు రూ.56.54 కోట్ల పంపిణీ


*


*: డిసెంబర్ - 2022లో మాండోస్ తుఫాన్ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన 226 మంది రైతులకు రూ.19.37 లక్షల పంపిణీ*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 28 (ప్రజా అమరావతి):


*పుట్టపర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం 2022-23 ఏడాదిలో డా.వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడవ విడత నగదు పంపిణీ, 2022 డిసెంబర్ లో మాండోస్ తుఫాన్ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రైతు భరోసా - పీఎం కిసాన్ కింద అర్హులైన 2,68,947 మంది రైతులకు రూ.56.54 కోట్ల మెగా చెక్ ను జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, తదితరులు రైతులకు పంపిణీ చేశారు. అలాగే డిసెంబర్ - 2022లో మాండోస్ తుఫాన్ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన 226 మంది రైతులకు రూ.19.37 లక్షల చెక్ ను పంపిణీ చేశారు.*


*ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ రైతులకు సాగు ఖర్చు కింద పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున డా.వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. అందులో భాగంగా రైతు భరోసా - పీఎం కిసాన్ కింద మూడవ విడత నగదు బదిలీ చేయడం జరిగిందని, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ లోపు గానే పరిహారం అందిచడంలో భాగంగా 2022లో మాండోస్ తుఫాన్ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ శాఖ పరిధిలో 192 మంది రైతులకు చెందిన 99.530 హెక్టార్లలో పంటలు నష్టం జరగగా, 14.15 లక్షల రూపాయలు, ఉద్యాన శాఖ పరిధిలో 34 మంది రైతులకు చెందిన 31.25 హెక్టార్లలో పంట నష్టం జరగగా, 5 లక్షల రూపాయలు కలిపి మొత్తం 226 మంది రైతులకు రూ.19.37 లక్షల చెక్ ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులు పెట్టుబడి సాయాన్ని, ఇన్పుట్ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు.*


*ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, సిరికల్చర్ జెడి పద్మమ్మ, ఏపీఎంఐపి పిడి సుదర్శన్, డిఆర్సీ డిడి రామనాయక్, శాస్త్రవేత్త రామసుబ్బయ్య, రైతులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*


*1.చాలా సంతోషంగా ఉంది*

*: అవుటాల ఓబిరెడ్డి, రైతు, బుచ్చయ్య గారి పల్లి గ్రామం, బుక్కుపట్నం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా.*


నాకు 6 ఎకరాల పొలం ఉంది. అందులో చీని, మామిడి మొక్కలను సాగుచేశా. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా డా.వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద వరుసగా నాలుగో ఏడాది పెట్టుబడి సాయం అందించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నాలుగో ఏడాది మూడవ విడతలో నాకు 2 వేల రూపాయల లబ్ధి కలిగింది. వర్షాల వల్ల ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ లోపు గానే పరిహారం అందిచడం చాలా గొప్ప విషయం. ఇందుకు ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.


Comments