వెయ్యి మంది టిబి పేషెంట్ల పోషకాహారానికి రూ. 37.29 లక్షలు విరాళమిచ్చిన ఎస్ బిఐ

 ఎపి వైద్య ఆరోగ్యశాఖ



*వెయ్యి మంది టిబి పేషెంట్ల

పోషకాహారానికి 

రూ. 37.29 లక్షలు విరాళమిచ్చిన ఎస్ బిఐ


*


అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘కనెక్ట్ టు ఆంధ్ర’  ద్వారా ప్రధానమంత్రి "టిబి ముక్త్  భారత్ అభియాన్" కార్యక్రమం కింద వెయ్యి మంది టిబి పేషెంట్లను దత్తత తీసుకున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI), వారి పోషకాహారానికి గాను 

రు. 37.29  లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందచేసింది. ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)  కింద ఎస్ బిఐ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 

సోమవారం నాడు ఇక్కడ  ఎస్ బి ఐ అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్ బిఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కనెక్ట్ టు ఆంధ్రా స్వచ్ఛంద సంస్థకు  బ్యాంక్ సిజిఎం నవీన్ చంద్ర ఝా, జిఎం3 కె గుండూరావు, జిఎం2 ఓం నారాయణ శర్మ, కిషన్ శర్మ జిఎం1ల సమక్షంలో ఈ చెక్ ను కనెక్ట్ టు ఆంధ్రా ప్రతినిధులు సంస్థ సీనియర్ కన్సల్టెంట్ కె బి ప్రశాంత్ రెడ్డి,  ఎపి స్టేట్ టిబి  ఐఇసి అధికారి కె నాగరాజులకు అందచేశారు.  2025 నాటికి దేశంలో టిబి మహమ్మారిని అంతం చేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోడీ  ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.  స్వయంగా పోషకాహారం సమకూర్చుకునే స్తోమత లేని టిబి పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం టి క్రిష్ణబాబు ఇటీవల పిలుపునిచ్చిన  విషయం తెలిసిందే.  ఈ పిలుపుపై స్పందించిన కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు తమ కార్పోరేట్ సామాజిక బాధ్యత పథకం (CSR)కింద  ప్రధానమంత్రి టిబి ముక్త భారత్ అభియాన్ లోని నిక్షయ్ మిత్రలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చాయి.  ఇందులో భాగంగానే వెయ్యి మంది టిబి పేషెంట్లను దత్తత తీసుకున్న ఎస్ బిఐ అమరావతి సర్కిల్ కార్యాలయం దాదాపు ఆర్నెల్లపాటు వారికి పోషకాహారాన్ని అందిస్తుంది.  ఈ కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కనెక్ట్ టు ఆంధ్ర సంస్థ, రాష్ట్ర టిబి కార్యాలయం సమన్వయంతో సహకరిస్తుంది. అంతర్జాతీయంగా 2030 నాటికి టిబిని పూర్తిగా నివారించాలని లక్ష్యాన్ని పెట్టుకోగా, మన దేశంలో ఐదేళ్లు ముందుగానే అంటే 2025 నాటికే నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


Comments