*బేతపూడి గ్రామం నుండి ఎమ్మెల్యే ఆర్కే సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన 40 కుటుంబాలు...
*
మంగళగిరి (ప్రజా అమరావతి);
మంగళగిరి నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు బేతపూడి గ్రామానికి చెందిన సుమారు 50 మంది టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానం పలికారు...
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నవరత్నాల పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, వారికి పార్టీ అండగా ఉంటుందని, కాలనీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బేతపూడి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు మరియు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు.
addComments
Post a Comment