ఆంధ్రప్రదేశ్ విద్యావిధానం అభినందనీయం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా


అమరావతి (ప్రజా అమరావతి);


*ఆంధ్రప్రదేశ్ విద్యావిధానం అభినందనీయం*



*-* కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు, పూర్వ కేంద్ర 

 శ్రీ ప్రకాశ్ జావదేకర్ గారు.


* పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్షా ఏర్పాటు చేసిన స్టాలును సందర్శించిన మంత్రులు.


33వ విజయవాడ పుస్తక మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖా - సమగ్ర శిక్షా ఏర్పాటు చేసిన స్టాలును కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖామాత్యులు  శ్రీ జి కిషన్ రెడ్డి గారు, పూర్వ కేంద్ర విద్యాశాఖామాత్యులు శ్రీ ప్రకాష్ జావదేకర్ గారితో కలిసి సందర్శించారు. 


ఈ సందర్భంగా జావదేకర్ గారు మాట్లాడుతూ  అటల్ టింకరింగ్ ల్యాబ్ లో పరిశోధలు చేయడం ద్వారా నేర్చుకుంటున్నారా, పరిశోధనాలు చేయడాన్ని ఆనందిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  


పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల ఏర్పాట్లను గురించి ప్రశంసించారు. 


కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు కేజీబీవీ విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్స్ & క్రాప్ట్ ఉత్పత్తులను చూసి విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. అతిథులకు విద్యార్థులు గౌరవవందనంతో  స్వాగతం పలికారు.

Comments