మచిలీపట్టణం లో మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషం – ఎం పి బాలశౌరి

 

మచిలీపట్టణం లో మెడికల్ కళాశాలకు అనుబంధంగా  నర్సింగ్ కళాశాలను  కూడా  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం  సంతోషం – ఎం పి బాలశౌరి

ఈ రోజు ఢిల్లీలో భారత ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతరామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం వారు  మచిలీపట్టణం లో ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను కూడా మంజూరుచేస్తున్నట్లు ప్రకటించడం సంతోషదాయకం. కేంద్ర ప్రభుత్వం వారు మెడికల్ కళాశాలతో బాటుగా నర్సింగ్ కళాశాలకు కూడా నిధులు మంజూరు చేసిన సందర్భంగా ప్రధాన మంత్రికి, సంబందిత ఆరోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు. దీనివల్ల మనప్రాంతంలోని నర్సింగ్ చదువుకునాలనుకునే విద్యార్ధిని  విద్యార్ధులకు మంచి వైద్యవిద్య అందుబాటులోకి వస్తుంది. అంతే గాకుండా ఇక్కడి రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు కూడా లభిస్తాయి. ఈ నర్సింగ్ కోర్సులకు మంచిడిమాండ్ ఉంటుంది కాబట్టి నర్సింగ్ విద్య నభ్యసించే విదార్ధిని విద్యార్ధులకు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి వారి ఆర్ధిక ఉన్నతికి తోడ్పడతాయి.

ఇటీవల  మన రాష్ట్రం లో రొయ్యల రైతులు రొయ్యలకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవడం వలనా నష్టాలకు గురవుతున్నారని, మన రాష్ట్రం నకు సంబందించిన పార్లమెంట్ సభ్యులు అందరం సంబందిత మంత్రి ని కలిసి, రొయ్యల రైతుల కష్టాలను వివరించడం జరిగింది. ఈ రోజు బడ్జెట్ లో రొయ్యల మేతకు సంబంధించిన  ఇంపోర్ట్ డ్యూటీ ని గణనీయంగా తగ్గించడం వలన, రొయ్యల పెట్టుబడి వ్యయం తగ్గి, రొయ్యల పెంపకం చేబడుతున్న రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశం.  ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారికి నా కృతజ్ఞతలు తెలియ పరచుకుంటున్నాను.


అలాగే మత్స్య కారుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం నకు 6 వేల కోట్ల రూపాయలు కేటాయించడం వలన మత్స్యకారుల ఎక్కువగా ఉన్నటువంటి మన మంచిలిపట్నం పార్లమెంట్ పరిధిలోని వారికీ ఎంతో మేలు జరుగుతుంది. 


అగ్రికల్చర్, యానిమల్ హస్బండ్రి, డైరీ మరియు మత్స్య రంగాల పరిశ్రమలకు చేయుట నిచ్చే విధంగా అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ ను ఈ బడ్జెట్ లో 20 లక్షల కోట్లకు పెంచడం వలన ఈ రంగాలు మరియు దీనిపై ఆధారపడిన ఎంతోమందికి సహాయంగా ఉంటుంది. 


రైతే దేశానికి వెన్నెముక, భారతదేశం వ్యవసాయక దేశం అని చెప్పుకునే మన దేశంలో రైతుకు సంబంధించి ప్రభుత్వ పధకాలు అయిన PMFBY – Pradhana Manatri Fasal Bima Yojana, PM KISAN, MGNREGS, Rashtriya Krishi Vikas Yojana,  Krishonnati Yojana వంటి పధకాలకు గణనీయంగా తగ్గింపులు చేయడం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులలో త్వరగా పాడైపోయేటటువంటి పంటలకు  సహాయపడే PSS – Price Support Scheme పధకం , PM-ASHAA పధకాలను పూర్తిగా విస్మరించడం శోచనీయం .

ఇప్పటికే ఎటువంటి మధ్య వర్తులు, దళారీలు లేకుండా గౌరవ ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యం లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పధకాల అమలు విషయంలో చేపట్టిన DBT – Direct Benefit Transfer లోని సౌకర్యాన్ని గ్రహించిన కేంద్రప్రభుత్వం దేశస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు విషయంలో ఇదే సూత్రాన్ని అనుసరిస్తామని చెప్పడం నిగంగా సంతొషించతగ్గ విషయం.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 5 లక్షల వరకు ఉన్న ఆదయ పరిమితిని 7 లక్షల వరకు ( వచ్చిన ఆదాయంలో ఇంటి అద్దె లోను 2 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ 1.50 లక్షలు అన్ని పోను 7 లక్షల ఆదాయం ఉంటె  ఆదాయపు పన్ను  విధింపు పై కొంత సరళిoచడం ఆనంద దాయకం. దీని వాళ్ళ ఎక్కువ మొత్తం లోని ధనం ప్రజల చేతుల్లో ఉండటం వలన దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 

అదేవిధంగా పేద మరియు మధ్య తరగతి వాళ్ళకు పెద్ద పీట వేస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకం నకు 79,500 కోట్లు, ఇంటింటికి మంచి నీటి కుళాయి కొరకు ఏర్పాటు చేసిన  జల జీవన్ పధకం నకు 70,000 కోట్లు , ఔషదాల తయారీ రంగానికి , ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు, పర్యావరణ కాలుష్యం తగ్గించే విద్యుత్ వాహనాల తయారీ రంగానికి అధిక మొత్తం లో నిధులు కేటాయించడం ముదావహం.


Comments