రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజనజోగుళాంబ గద్వాల్ పోలీస్ (ప్రజా అమరావతి);రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన .మహా శివరాత్రి సందర్భంగా అలంపూర్ దేవాలయం  వెళ్ళి జ్యోతి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వెళ్ళే క్రమంలో మానవ పాడు మండలం కొర్విపాడు  గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు *సాయి కుమార్ , రఫీ మరియు  శేఖర్ లు*  బైక్ పై వెళ్తుండగా ఉండవల్లి మండలం భైరపురం గ్రామ శివారు నందు రాత్రి 12:30 గంటల సమయంలో ఎదురుగా వచ్చిన కోళ్ల బులేరో వాహనం డీ కొట్టి ఆకడికక్కడే మృతి చెందిన విషయం కు  సంబందించి *జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన* గారు స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ప్రమాదం జరగటానికి గల కారణాలను ఆలంపూర్ సి. ఐ సూర్య నాయక్ గారు ఎస్పీ గారికి వివరించారు. ప్రమాద సంఘటన కు సంబందించి పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు అధికారులను అదేశించారు.

ఎస్పీ గారి వెంట ఉందవెల్లి ఎస్సై బాలరాజు, ఆలంపూర్ ఎస్సై మహేందర్ ఉన్నారు.

Comments