లేని అధికారంతో అమరావతి రాజధానిని విధ్వంసం చేస్తున్న జగన్‌ రెడ్డికి ప్రజాకోర్టులోనూ శిక్ష తప్పదు

 రాజధాని మార్చే అధికారం శాసన సభకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు తీర్పు & కేంద్ర అఫిడవిట్‌

అమరావతి (ప్రజా అమరావతి);

లేని అధికారంతో అమరావతి రాజధానిని విధ్వంసం చేస్తున్న జగన్‌ రెడ్డికి ప్రజాకోర్టులోనూ శిక్ష తప్పదు 


    

భూకబ్జలు మైనింగ్‌ దోపిడి కోసమే  జగన్‌రెడ్డి చూపు విశాఖ వైపు..

చట్ట బద్దత లేని చట్టాన్ని తెచ్చి జగన్‌ రెడ్డి మూడు ప్రాంతాల్ని నాశనం చేస్తున్నాడు

అమరావతి రాజధాని నిర్ణయంలో అంతా చట్టబద్దంగానే జరిగింది


*తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు*


రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన రాజధాని విషయంలో చోటు చేసుకున్న తాజా కీలక పరిణామాల నేపథ్యంలో ఈ ప్రెస్‌ మీట్‌ నిర్వహించాలని నిర్ణయించుకొని మిమ్మల్ని పిలిచాను.

విభజనవల్ల జరిగిన నష్టంకంటేజగన్మోహన్‌రెడ్డి విధ్వంసపూరిత చర్యలతో జరిగిన నష్టమే ఎక్కువ.

జగన్మోహన్‌రెడ్డి లాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి వస్తేరాష్ట్రప్రయోజనాల్ని ఏవిధంగా కాలరాస్తాడోరాష్ట్రాభివృద్ధి ఎంతగా దెబ్బతింటుందో చెప్పడానికి రాజధాని అమరావతి విధ్వంసమే ఒక ఉదాహరణ.

నిన్న కేంద్రప్రభుత్వం రాష్ట్రరాజధానికి సంబంధించి సుప్రీంకోర్ట్‌లో అఫిడవిట్‌ వేసింది. 

అఫిడవిట్‌లోని పాయింట్‌ నెం-పేజీనెం-లో న రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్‌ కమిటీ వేశారనిన ఆకమిటీ నివేదిక ఇచ్చిందనినివేదికను రాష్ట్రప్రభుత్వానికి పంపించామనిఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం న రాజధానిగా అమరావతిని  ప్రకటించిందని చెప్పారు.

నిన్న సుప్రీం కోర్టులో కేంద్రం అమరావతిపై ఇచ్చిన అఫిడవిట్‌రాజ్యసభలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ చెప్పిన సమాధానంఅమరావతిపై ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ చేసిన కుట్రలువైసీపీప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల్ని ఎండగట్టింది. 

రాష్ట్ర రాజధాని విషయంలో మొదటి నుంచి అంతా చట్ట బద్దంగానే జరిగింది. నాడు చేపట్టిన భూ సమీకరణ నుంచి తరువాత సీఆర్డీఏ చట్టం ఏర్పాటు వంటివన్నీ చట్టబద్ధంగానే జరిగాయి. 

విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీలోని అంశాలను పరిగణనలోకి తీసుకునే రాజధానిగా అమరావతి ఎంపిక జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అఅవఞబతీవ - లోని ఇదే విషయాన్నిఇప్పుడు కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌ ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది.

సుప్రీం కోర్టుకు  కేంద్ర హోం శాఖ సమర్పించిన అఫిడవిట్‌ 

As per AP Reorganisation act-2014 section 5…… after expiry of the period, Hyderabad shall be capital of the state of Telangana and there shall be a new capital for the state of Andhra Pradesh.

అంటే విభజన చట్టం ప్రకారం ఏపీకి కొత్తగా ఒక రాజధాని మాత్రమే ఉంటుంది అని స్పష్టం చేశారు. అయితే దానికి భిన్నంగా మూడు రాజధానులు అంటూ జగన్‌ మూడు ముక్కలాటకు తెరతీశారు.

As per AP Reorganisation act-2014 section 6...Central govt shall constitute a expert committee to study various alternatives for new capital. Accordingly in terms of section 6 of reorganisation act constituted expert committee on 28.03.2014 under the chairmanship of  Shri KS. Shiva Ramakrishan. The committee submitted its report on 30.08.14 laying down brad guidelines which will require to be considered while selecting new capital. The said report was sent to AP govt for necessary action. Subsequently govt of andra Pradesh 23.04.2015 notified that the capital city be named as Amaravthi.

ఈ అఫిడవిట్‌ ద్వారా విభజన చట్ట ప్రకారంకేంద్ర నియమించిన కమిటీ నివేదిక ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగిందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. 

కేంద్రం ఆమోదంతోవిభజన చట్టం ప్రకారం నాడు అమరావతిని ప్రజారాజధానిగా నిర్ణయించిసీఆర్డీఏ చట్టం చేశాము. ఇదేమీ రహస్యంగా చేయలేదు..రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో చర్చించి తీసుకున్న నిర్ణయం. రాజధానిగా అమరావతికి నాడు సభలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా పూర్తి మద్దతు పలికింది. 

సాక్షాత్తూ ప్రధానమంత్రి యమునా జలాల్నిపార్లమెంట్‌ మట్టిని తీసుకొచ్చిమీరు ఏకాకులు కాదుమొత్తం పార్లమెంట్‌ మీకు అండగా ఉంటుంది. దేశానికి చట్టాలుచేసే పార్లమెంట్‌ సాక్షిగా నేను ఇక్కడకు వచ్చాను’’ అనిచెప్పారు.

విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన రాజధానికి నాడు కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న సెక్షన్‌  ప్రకారం సచివాలయంహైకోర్టుఅసెంబ్లీ నిర్మాణాలకు రూ. కోట్లు ఇచ్చింది. (రూ.కోట్లు భవనాల నిర్మాణానికిరూ.కోట్లు విజయవాడ గుంటూరు మున్సిపాలిటీల అభివృద్ధికోసం కోసం కేటాయించారు). స్మార్ట్‌ సిటీల కింద మరో రూ.కోట్లు ఇచ్చారు.  

ఇలా అన్ని నిబంధనల ప్రకారమే అమరావతి ఆవిర్భావం జరిగింది.

అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రాజధానుల అంశంపై కేంద్రానికి సమాచారం లేదని నిన్న రాజ్యసభలో లిఖిత పూర్వకంగా కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు. 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం... Miniter Shri Nityanada rai Answer in Rajya Sabha…while enacting the 3 capital act-2020 state govt has not consulted the central govt.

మూడు రాజధానుల పై చట్టబద్దత లేని ఒక చట్టాన్ని తెచ్చిన జగన్‌ మోహన్‌రెడ్డి అన్నీ ప్రాంతాలను మోసం చేస్తున్నాడు. మూడు రాజధానులు అంటూ చట్టాన్ని తెచ్చిన జగన్‌ ఆ బిల్లులను మళ్లీ వెనక్కి తీసుకున్నాడు.  దీంతో మూడు రాజధానులు అనేది తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాలమధ్య చిచ్చు రేపడానికే అని తేలిపోయింది. 

అమరావతిపై విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు: ఒక సారి రాజధాని నిర్ణయం జరిగిన తరువాత మళ్లీ దాన్ని మార్చే అధికారం లేదన్న విషయం జగన్‌కు కూడా తెలుసు. అందుకే రాజధాని మార్పు విషయంలో తమకు అధికారం కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి తో పార్లమెంట్‌ లో  తేదీన ప్రైవేటు బిల్లు పెట్టించారు. అలాచేయడం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చెయ్యడం కాదా


అమరావతిపై హైకోర్టు తీర్పు:

  

అమరావతిపై మార్చి న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది.

legislative competence శాసనసభకు లేదంటూ హైకోర్టు తీర్పు: We also hold that the Legislature has no legislative competence to pass any resolution/law for change of capital or bifurcating or trifurcating the capital city.

హైకోర్ట్‌ జడ్జిమెంట్‌లోని పేరా లో మంగల్‌ సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. ఆ తీర్పును పేర్కొంటూ...రాజధానిలో భాగమైన లెజిస్లేటివ్‌ఎగ్జిక్యూటివ్‌జ్యూడీషియరీ విభాగాల ఏర్పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్‌  ప్రకారం పార్లమెంట్‌ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

అంతేకాకుండారాజధాని ఏర్పాటు నిర్ణయం పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సిఫారసుల మేరకు జరిగిందనికాబట్టి రాజధానిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది తిరిగి పార్లమెంటు ద్వారానే జరగాలని కూడా స్పష్టం చేసింది.


ప్రజాధనం దుర్వినియోగం : 

 

ఒక వైపు న్యాయస్థానాలు స్పష్టంగా చెపుతున్నా జగన్‌ తన తీరు మార్చుకోలేదు. అమరావతి విషయంలో తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లన్నట్లు జగన్‌  వ్యవహరిస్తున్నారు.

రాజ్యాంగ విరుద్దంగా మూడు రాజధానుల బిల్లు చట్టసభల్లో పెట్టడమే కాకుండా.... తనకు అధికారం లేదని తెలిసి జగన్మోహన్‌ రెడ్డి చట్టాలను వక్రీకరించేలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.శాసనసభలో బిల్లు పాస్‌ చేశారు. 

నిబంధనల ప్రకారం వ్యవహరించిన అప్పటి మండలి చైర్మన్‌ ఎం.ఏ. షరీఫ్‌ గారిని దారుణంగా దూషించారు. 

బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపారనిఏకంగా మండలినే రద్దు చెయ్యాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన తుగ్లక్‌ సీఎం ఈ జగన్మోమోహన్‌ రెడ్డి.

అమరావతిపై కోర్టు కేసుల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు. జీవో నెంబర్‌  ద్వారా నిరంజన్‌ రెడ్డికి రూ.  లక్షలుజీవో నెంబర్‌ ఇతర జీవోల ద్వారా ముకుల్‌ రోహిత్గీకి రూ.  కోట్లు చెల్లించాడు. వీళ్లిద్దరూ కూడా గతంలో జగన్‌ అక్రమాస్తుల కేసులు వాదించిన వాళ్లే. పైగా తన కేసులు వాదించిన తెలంగాణకు చెందిన నిరంజన్‌ రెడ్డికి రాజ్యసభ పదవి కూడా ఇచ్చాడు.


అమరావతి ప్రాధాన్యం - అమరావతిపై దుష్ప్రచారం


రాష్ట్రంలోని  జిల్లాల అభివృద్ధికి ప్రధాన ఆదాయవనరు అమరావతి. రైతులు అమరావతి నిర్మాణానికి  ఇచ్చిన వేలఎకరాల ద్వారా రూ. లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి దక్కింది. జగన్‌ ఆ భూముల్ని నిర్వీర్యం చేశారుభూములిచ్చిన రైతుల్ని అవమానించివేధించిహింసించారు.

న్యాయంకోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్రచేపడితేదారిలో వారిని నానా రకాలుగా వేధింపులకు గురిచేశారు.

అమరావతి నిర్మాణంలోటీడీపీప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుపెట్టింది. అలాంటి దానిపై మీరు విషంచిమ్మారు. 

మూడు రాజధానుల సిద్ధాంతంతో బోస్టన్‌ కమిటీ ద్వారా అమరావతి నిర్మాణంపై అబద్ధాలు చెప్పించారు. అమరావతి ప్రాంతం నిర్మాణాలకు అనుకూలం కాదనిభూమిబలహీనమంటూమద్రాస్‌ ఐఐటీ పేరు దుర్వినియోగం చేసి అడ్డంగా దొరికిపోయారు.

ఇన్‌ సైడర్‌ ట్రేడిరగ్‌ ఆరోపణలు చేశారు. అసైన్డ్‌ భూములని నానాయాగీచేశారుఎక్కడికక్కడ ఎన్ని ఆరోపణలు చేయాలో అన్నీచేసిచివరకు రాష్ట్రాన్నే నాశనంచేసే స్థితికి వచ్చారు.

అమరావతి పూర్తైఉంటేఅన్ని నిర్మాణాలకుపోగా ప్రభుత్వానికి  ఎకరాల భూమి మిగిలేది. ఎకరం భూమివిలువ రూ.కోట్లు వేసుకున్నారూ.వేలకోట్లు. రూ.కోట్లచొప్పున లెక్కేస్తే రూ.లక్షావేలకోట్లు.  

అమరావతి పూర్తైఉంటే హైదరాబాద్‌బెంగుళూరుచెన్నైలకు ధీటుగా రాష్ట్రానికి పెద్దఎత్తున ఆదాయం సమకూరేది.  

  

విధ్వంసమే జగన్‌ విధానం :

ప్రజావేదికతో ప్రారంభమైన జగన్‌ విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతోంది. అమరావతిలోనిరోడ్డుని తవ్వేయడంఇసుకదొంగిలించడం.. బుద్ధుంటే ఇలాంటి పనులు చేస్తారాసాక్షాత్తూ అంబేద్కర్‌ విగ్రహాలే మాయంచేశారు. 

అమరావతి - పోలవరం ప్రాజెక్టును రెండు కళ్లుగా భావించి పనులు పరుగులు తీయించాం. 

జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండిరటిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అంథకారంలోకి నెట్టారు. రూ.వేలకోట్లతో అమరావతిలో నిర్మాణాలు చేపడితే గ్రాఫిక్స్‌ అని ఎద్దేవాచేశారు.

అమరావతిపై కులం ముద్ర వేశారు. అక్రమాలు అన్నారు. లక్షల కోట్ల ఖర్చు అన్నారు. ఇలా రోజుకో అబద్దాన్ని ప్రచారం చేశారు. చివరకు ఒక్కటీ నిరూపించలేదు. 

అమరావతికి లక్షల కోట్ల ఖర్చు అవసరం లేదు...అది సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ ప్రాజెక్ట్‌. అమరావతి పూర్తై ఉంటే రాష్ట్రానికి పెద్ద ఆదాయ వనరుగా ఉండేది. ఈ రోజు తెలంగాణకు హైదరాబాద్‌ ఎంత ఆదాయాన్ని ఇస్తుందో మనం అంతా చూస్తున్నాం.

మరోవైపు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని కూడా నాశనం చేశారు. శాతం పూర్తి అయిన ప్రాజెక్టును గోదాట్లో కలిపారు.

టీడీపీప్రభుత్వం  ఏళ్లల్లో  శాతం పనులు చేస్తేజగన్‌  ఏళ్లల్లో కేవలం  ాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అదికూడా కాపర్‌ డ్యామ్‌ ల మధ్యలో ప్రణాలికలేకుండా నిర్మాణాలుచేశారు. డయాఫ్రమ్‌ వాల్‌ వరదకు దెబ్బతింటే దాన్ని దాచిపెట్టారు. 

పోలవరం పూర్తైఉంటే నదుల అనుసంధానం జరిగి ప్రతిఎకరాకు నీరందేది. అమరావతి నిర్మాణం పూర్తై ఉంటే మనపిల్లలు పొట్టకూటికోసం పొరుగురాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చేదికాదు. 

తన అసమర్థతచేతగానితనంతో జగన్‌  రాష్ట్రానికి ఓ శనిగ్రహంలా దాపురించారు.

ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు ఎవరైనాచట్టాన్ని గౌరవిస్తామనిరాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామనిరాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని ప్రమాణస్వీకారం చేస్తాము. ఆ ప్రమాణానికి పూర్తి విరుద్ధంగా ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు.


మూడుముక్కలాట ఎందుకు


విశాఖలో మూడున్నరేళ్లలో రూ.వేల కోట్ల భూములు దోచుకున్నారు. విశాఖకు అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పగలరా. దేశానికి వాణిజ్య రాజధానిగా విశాఖను మార్చాలని మేం చూస్తేవీళ్లు కబ్జాల నగరంగాగంజాయి కేంద్రంగా మార్చారు. 

దసపల్లా భూములుహయగ్రీవ భూములుఎన్‌ సీసీ భూములుచర్చికి చెందిన ఆస్తులుబే పార్క్‌వాల్తేర్‌ క్లబ్‌కార్తీకవనంప్రేమ సమాజం భూములుగీతంసంస్థ భూములురామానాయుడిస్టూడియోఏ నిషేధిత జాబితాలోని భూములు కాజేశారు.

విశాఖలో ఉన్న పరిశ్రమలను తరిమేశారు. చివరికి రుషికొండను బోడిగుండుగా మార్చి ఇప్పుడు...గ్రీన్‌ మ్యాట్‌ తో కవర్‌ చేస్తున్నారు. 

వేల కోట్ల విలువ చేసే బీచ్‌ శాండ్‌మోనోజైట్‌ అక్రమంగా తరలిస్తున్నారు.

విశాఖ ఏజన్సీలో లాటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వకాల ద్వారా రూ.వేల కోట్ల దోపిడీకి కుట్రపన్నారు.

 యాక్టుపీసా చట్టానికి విరుద్ధంగా విశాఖ ఏజెన్సీల ఆదివాసుల భూములు వేల ఎకరాలు జగన్‌ తన వారికి కట్టబెడుతున్నాడు. 

రాష్ట్రచరిత్రలో ఇలాంటి వరెస్ట్‌ ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడూచూడలేదు. 

అమరావతి నిర్మాణానికి మాకు డబ్బులు అవసరంలేదని కేంద్రంతో చెప్పిన పెద్దమనిషి. బుద్ధుండే వాడు ఎవడైనా సరేమీరు ఇచ్చిన రూ.కోట్లుచాల్లేదు.. ఇంకా కావాలని అడిగేవారు. 

ఈ ముఖ్యమంత్రి మభ్యపెట్టడంలోదిట్టదోచుకోవడంలో అనకొండ. చట్టమంటే భయం లేదురాజ్యాంగమంటే గౌరవం లేదు. టన్నులకొద్దీ సంపాదించాను. దానితో ఏదైనా కొంటాను.. దేన్నైనా సాధించగలననే అహంకారంతో ఉన్నాడు.

జగన్‌ చెప్పిన న్యాయరాజధాని ఏమైంది. నేను కర్నూలు వెళితేఅక్కడ న్యాయవాదుల్ని రెచ్చగొట్టాడు. ఆరోజే మీరు మోసపోతున్నారని వారికి చెప్పాను. 

విశాఖపట్నంలో రాజధాని రాదనిఆ అధికారం లేదని తెలిసినా ఇంకా నాటకాలు ఆడుతూవిశాఖపట్నంఉత్తరాంధ్రప్రజల్ని మోసగిస్తారా

ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రజాకోర్టులో జగన్మోహన్‌ రెడ్డిని దోషిగా నిలబెట్టేవరకు టీడీపీ పోరాడుతుంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం.

వైసీపీనేతలు తమబానిసత్వంతో రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని సూచిస్తున్నాం.

తెలుగుదేశం ఎప్పుడూ రాష్ట్రప్రయోజనాలే పరమావధిగా పనిచేసింది. అధికారం కోసం పనిచేయలేదు. వాజ్‌ పేయ్‌ హయాంలో పదవులు వద్దని రాష్ట్రంకోసం పనిచేశాము. 

 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేకహోదా సాధిస్తాం..కేంద్రం మెడలు వంచుతామన్నారు. ఇప్పుడు పైరవీలకోసం రాజ్యసభ సీట్లు అమ్ముకునే దుస్థితికి వచ్చారు.

సుప్రీంకోర్టు రాజధానిపై స్టే ఇచ్చిందని టీవీ- ఛానల్‌ స్క్రోలింగ్స్‌ వేసింది. అలాంటి మ్యానిప్లేషన్స్‌ తో పబ్బం గడుపుకోవడానికి బాగా అలవాటుపడ్డారు.

జగన్మోహన్‌ రెడ్డి ఏ నిబంధనలప్రకారం పాదయాత్ర చేశాడుఇప్పుడు ఇక్కడ ది గ్రేట్‌ లీడర్‌ ది గ్రేట్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఆర్డర్‌ వేస్తేగ్రేట్‌ ఆఫీసర్‌ ఇంటిలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు రిపోర్టులు ఇస్తేఅందరిపై కేసులు పెట్టిలోకేశ్‌ పాదయాత్ర అడ్డుకుంటారా

చట్టప్రకారం ఎవరైనా సరే పాదయాత్రలు చేయొచ్చుసభలుసమావేశాలు నిర్వహించుకోవచ్చు. 

వివేకానందరెడ్డిని మర్డర్‌ చేసిదానిపైఎన్ని నాటకాలు ఆడారోఎన్నికుప్పిగంతులు వేశారో చూస్తున్నాం. 

కాకినాడలో ఈ రోజు  మంది చనిపోయారు. ఎవరయ్య జీవోనెం- తీసుకురమ్మంది. ప్రజల్ని కంట్రోల్‌ చేయలేనందుకు సిగ్గుపడకుండా జీవోలు తెస్తారాయాక్ట్‌ ఎక్కడుందిప్రశాంతంగా జరిగే పాదయాత్రను అడ్డుకునే అధికారం ఎవరిచ్చారు వీళ్లకు

ఈయనఈయన తండ్రిచెల్లి అందరూ పాదయాత్రచేశారు. కొవ్వెక్కిపోయి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రజలే ఆ కొవ్వు తీసేస్తారు. 

తమాషా అనుకోవద్దు... పోలీసుల్నిముఖ్యమంత్రుల్ని చాలామందిని చూశాను. రఘురామరాజుని పోలీసులు టార్చర్‌ చేస్తే ఇంట్లో వీడియోకాల్‌ లోచూసి ఆనందించే పైశాచిక ముఖ్యమంత్రి.  మంచి పోలీస్‌ అధికారుల్ని అభినందిస్తాను.. తప్పులుచేసేవాళ్లను వదిలిపెట్టను.

సిఎంను  ఏదో అన్నాడని ఒక కానిస్టేబుల్‌ని అరెస్ట్‌ చేశారు. మీరు మమ్మల్ని అనేవాటికి మేం ఏం చేయాలిమీరు చేసే పనులకు రాష్ట్రంలో భవిష్యత్‌లో రోడ్లపై కూడా తిరగలేరు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినారాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోవడం ఖాయం. 


విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడుపొలిట్‌ బ్యూరోసభ్యులు శ్రీ వర్ల రామయ్యశ్రీ బొండా ఉమామహేశ్వరరావుశ్రీ నక్కా ఆనంద్‌ బాబుశ్రీ నిమ్మల రామానాయుడుశ్రీ గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Comments