ఘనంగా ముగిసిన అంతర్ జిల్లాల అర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు



*ఘనంగా ముగిసిన అంతర్ జిల్లాల అర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు*



పార్వతీపురం, ఫిబ్రవరి 15 (ప్రజా అమరావతి): జిల్లాలో గత మూడు రోజులుగా జరుతున్న అంతర్ జిల్లాల అర్చరీ చాంపియన్ షిప్ పోటీలు బుధవారం ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలలో గెలుపొందిన విజేతలకు పతకాలను  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అందరూ క్రీడా స్పూర్తితో పాల్గొనటం సంతోషదాయకం అన్నారు. పోటీలలో  విజేతలుగా గెలుపొందిన వారు రానున్న కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఏ పోటీలో అయినా గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు నిరుత్సాహపడకుండా క్రీడా స్పూర్తితో ముందుకు సాగితే భవిష్యత్ లో విజయాలను సొంతం చేసుకుంటారని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలచిన విజేతలకు పతకాలతో పాటూ సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. 


పోటీల్లో 14 సంవత్సరాల బాలికల విభాగంలో పాల్గొన్న  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బి. గాయత్రి వల్లి మొదటి స్థానం కైవసం చేసుకోగా, చిత్తూరు జిల్లాకు చెందిన కె. సాయి సుజయ, డి. గీతికా రెండు, మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు. వై.ఎస్.ఆర్. కడప జిల్లాకు చెందిన ఈ. శివదుర్గ నాల్గవ స్థానం దక్కించుకున్నారు. 

14 సంవత్సరాల బాలుర విభాగంలో  మొదటి స్థానం విశాఖపట్నం కు చెందిన ఎస్.రామ్ చైతన్య దక్కించుకోగా, ద్వితీయ స్థానంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన జి. వెంకటలోకేశ్, తృతీయ స్థానంలో వై.ఎస్.ఆర్. కడప జిల్లాకు చెందిన వై. నవనీష్, నాల్గవ స్థానంలో చిత్తూరు జిల్లాకు చెందిన వై. ధీమంత్ ప్రసాద్ దక్కించుకున్నారు. 


17సంవత్సరాల బాలికల విభాగంలో మొదటి స్థానం చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.సంజన, ద్వితీయ స్థానంలో వై.ఎస్. ఆర్. కడప జిల్లాకు చెందిన కె. దీపికా, తృతీయ స్థానంలో వై. ఎస్. ఆర్.కడప జిల్లాకు చెందిన టి. తీర్థప్రియ, నాల్గవ  స్థానంలో విజయనగరం జిల్లాకు చెందిన జి. లహరి విజేతలుగా నిలిచారు.


 17 సంవత్సరాల బాలుర విభాగంలో ప్రధమ స్థానంలో విశాఖజిల్లాకు చెందిన ఆర్.నాగేంద్రబాబు నాయక్, ద్వితీయ స్థానంలో వై.ఎస్. ఆర్. కడప జిల్లాకు చెందిన జి. భాస్కర్, తృతీయ స్థానంలో పి. వి. ఎన్. కే. భరత్ చిత్తూరు జిల్లా నాల్గవ స్థానంలో విశాఖ జిల్లాకు చెందిన కె. భరత్ తేజ విజేతలుగా నిలిచారు.


 ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.డి.వి. రమణ, క్రీడల చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పి. వెంకటరమణ, గాంధీ, ఎం. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments