గన్నవరం ఘటన తర్వాత "కీ రోల్ పోషించిన మాజీ ఎమ్మెల్యే రావి*

 *- గన్నవరం ఘటన తర్వాత "కీ రోల్ పోషించిన మాజీ ఎమ్మెల్యే రావి* 


 *- ఒకవైపు నేతలను కలవనీయకుండా హౌస్ అరెస్ట్ లు*

 *- ఇంకోవైపు కోర్టు పరిసరాల్లో పోలీసులు మోహరింపు* 

 *- చంద్రబాబు ఫోన్ కాల్ తో చాకచక్యంగా కోర్టుకు* 

 *- అరెస్ట్ అయిన టీడీపీ నేతలను కలిసి ధైర్యం నింపిన రావి* 

 *- తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు చంద్రబాబుకు వివరణ* 

 *- గన్నవరం టీడీపీ శ్రేణులతోనూ చర్చించిన రావి* 

 *- ఇప్పుడెక్కడ విన్నా రావి గ్రాఫ్ "అమాంతం పెరిగిందనే”* గుడివాడ, ఫిబ్రవరి 23 (ప్రజా అమరావతి): గన్నవరం ఘటన తర్వాత కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు "కీ రోల్" పోషించడం ద్వారా ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణుల దృష్టిని ఆకర్షించారు. | తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఫర్నీచర్ ధ్వంసం, వాహనాలను తగలబెట్టడం, పార్టీ నేతల, కార్యకర్తల ఇళ్ళపైనా దాడులు చేయడం వంటి ఘటనల నేపథ్యంలో పోలీసులు ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ లు చేశారు. గన్నవరం రానివ్వకుండా, అరెస్ట్ చేసిన నేతలను కలవనివ్వకుండా ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను అడ్డుకోవడం జరిగింది. ఇంకోవైపు గన్నవరం కోర్టు పరిసరాల్లోనూ భారీగా పోలీసులు మోహరించారు. దీంతో టీడీపీ ముఖ్య నేతలంతా పోలీసుల హౌస్ అరెస్ట్ ల వలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రావికి చంద్రబాబు చేసిన ఫోన్ కాల్ తో పరిస్థితి అంతా మారిపోయింది. పోలీసులు హౌస్ అరెస్ట్ ల వలయాన్ని చేధించుకుని బైక్ పై చాకచక్యంగా రావి గన్నవరం కోర్టుకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను కలుసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చే వరకు వెన్నంటే ఉన్నారు. చంద్రబాబు చెప్పి పంపినవన్నీ వివరించి టీడీపీ నేతల్లో ధైర్యాన్ని నింపారు. గన్నవరంలో తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు వివరిస్తూ వచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టిన దగ్గర నుండి న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే వరకు చేయగల్గినదంతా రావి చేస్తూ వచ్చారు. మరోవైపు గన్నవరం టీడీపీ శ్రేణులతోనూ రావి మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం కూడా చేశారు. ఇదిలా ఉండగా గన్నవరం ఘటన తర్వాత టీడీపీలో ముఖ్యనేతలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తారనే సమాచారం ఉన్న నేతలు, బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని హౌస్ అరెస్ట్ లు చేయడానికి ప్రయత్నించారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విషయానికొస్తే ఆయన ఎక్కడ ఉన్నారనేది పోలీసులకు సమాచారం లేదు. చంద్రబాబు స్వయంగా రావికి ఫోన్ చేసి గన్నవరం కోర్టు వెళ్ళాలని ఆదేశించినట్టుగా తెలుసుకున్నారు. కోర్టు దగ్గరకు ఎవరినీ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అయినప్పటికీ పోలీసుల కంట పడకుండా ఎంతో చాకచక్యంగా రావి గన్నవరం చేరుకున్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా రావి నడుచుకోవడం వల్ల పోలీసులు అరెస్ట్ చేసిన నేతలకు, గన్నవరం టీడీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసాను ఇవ్వగలిగారు. గుడివాడ సహా ఉమ్మడి కృష్ణాలో ఇప్పుడెక్కడ విన్నా రావి గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిందంటున్నారు.

Comments