పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి*
*: పోలింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి*
*: ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదు*
*: జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 28 (ప్రజా అమరావతి):
*పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ పోలింగ్/సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం హాలు నందు పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై నిర్వహించిన మొదటి శిక్షణా తరగతుల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నియామ నిబంధనల ప్రకారం పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకూడదని, ఎన్నికల ప్రక్రియపై పూర్తిస్థాయి శిక్షణ పొంది ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పోలింగ్/సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పట్టభద్రలకు సంబంధించి 54 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయులకు సంబంధించి 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు ఉన్న మాస్టర్ ట్రైనర్లచే సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. రెండు విడతల పాటు శిక్షణనిచ్చిన అంశాలపై మూడవ విడత శిక్షణలో పోలింగ్ ప్రక్రియపై టెస్టులు నిర్వహిస్తామని... ఇందుకు సంబంధించిన క్వశ్చన్యర్ తయారు చేయాలని AHUDA డిప్యూటీ కలెక్టర్ నుజిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకొని బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్, ఇతర పోలింగ్ మెటీరియల్ తో పాటు సదరు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొంది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆదేశించారు. భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల బుక్లెట్లను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా చదివి ఆకళింపు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి ఫిర్యాదులు రాకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం డిఆర్ఓ కొండయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా మీ విధులు నిర్వర్తించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ అకౌంటు ను పరిశీలించుకోవాలి. పి ఓ డైరీ, డిక్లరేషన్ మొదలైన అంశాలను అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి డివిజన్లను సంబంధించిన ఎన్నికల అధికారులు .
వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలింగ్/సహాయ పోలింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment