అగ్ని యాప్ ను ప్రారంభించిన హోంమంత్రిఅమరావతి (ప్రజా అమరావతి);
వెలగపూడి సచివాలయంలో అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు డా.తానేటి వనిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, ఫైర్ మరియు సిఐడి డీజీ సంజయ్ కుమార్, ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్లు శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, జ్ఞాన సుందరం, రీజినల్ ఫైర్ సర్వీస్ అధికారులు పాల్గొన్నారు. 


ఆంద్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీ ని ఉపయోగించి ఆటోమేటెడ్ గవర్నన్స్ అండ్ NOC ఇంటిగ్రేషన్ (AGNI) యాప్ ను రూపొందించారు. ఈ నేపథ్యంలో అగ్ని యాప్ ను హోంమంత్రి డా.తానేటి వనిత 


కంప్యూటర్ లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ అగ్ని యాప్ ద్వారా హాస్పిటల్, కార్పొరేట్ భవనాలు, కమర్సియల్ కాంప్లెక్స్ లకు  ఎన్ ఓ సి లను సులభంగా పొందవచ్చు అని ఫైర్ ఉన్నతాధికారులు తెలిపారు. NOC కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లో నుండే ఆన్లైన్ ద్వారా అప్లై చేసి సులువుగా పొందవచ్చు అన్నారు. ఈ అగ్ని యాప్ ను త్వరలో ఇండస్ట్రీస్, హెల్త్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు కూడా అనుసంధానం చేసి సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఫైర్ డీజీ సంజయ్ పేర్కొన్నారు.


అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ శాఖలో కొత్తగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ పదవి నుండి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ గా పదోన్నతి పొందిన అధికారులు హోంమంత్రి వనిత ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్లు గా పదోన్నతి పొందిన శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, జ్ఞాన సుందరం లను హోంమంత్రి తానేటి వనిత అభినందించారు. అదేవిధంగా అగ్ని యాప్ ను రూపొందించిన టెక్నికల్ టీమ్ ను కూడా అభినందించడం జరిగింది. ఫైర్ సర్వీస్ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని హోంమంత్రి డా.తానేటి వనిత సూచించారు.

Comments