బాలికపై కిరోసిన్ పోసి హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష.

 కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం,

కాకినాడ (ప్రజా అమరావతి);


బాలికపై కిరోసిన్ పోసి హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష.


 పరిహారంగా ఏడు లక్షల 50 వేల రూపాయలు మరణించిన బాలిక తల్లికి చెల్లించాలని తీర్పు.


సత్పలితాలు ఇస్తున్న కాకినాడ జిల్లా SP, శ్రీ M.రవీంద్రనాధ్ బాబు, IPS  గారి  కోర్ట్ ట్రైల్ కేసుల విచారణ స్వీయ పర్యవేక్షణ.


పోక్సో చట్ట ప్రకారం ముద్దాయిలకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ.


కాకినాడ జిల్లాలో వివిధ కోర్టులలో విచారణకు వచ్చే కేసులను గుర్తించి వాటి ట్రైల్స్ లో పురోగతిని జిల్లా ఎస్పీ గారు టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ శిక్షల శాతం పెంచే దిశలో భాగంగా సిబ్బందిని మోటివేట్ చేయడం జరుగుతున్న సందర్భంలో భాగంగా  పిఠాపురం CI, YRK శ్రీనివాసు, SI B.జగన్మోహన్ రావు, పిఠాపురం సర్కిల్ సెషన్స్ కోర్టుకు హాజరయ్యే ASI V.దుర్గారావు లు  నిరంతర పర్యవేక్షణలో జరిగిన కేసు విచారణలో పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసు తుది విచారణ ముగిసిన పిదప స్పెషల్ కోర్ట్ ఫర్ స్పీడీ ట్రైల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ద పోక్సో యాక్ట్ -2012, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ గౌరవ స్పెషల్ జడ్జి  , పోక్సో కోర్టు శ్రీ L.వేంకటేశ్వర రావు గారు ముద్దాయి ముక్కుడుపల్లి నవీన్ కుమార్ @ నవీన్ అనువానికి ఈరోజు 03.02.2023 వ తేదీన జీవిత ఖైదు మరియు జరిమానా కింద రూపాయలు 2250/-  విధిస్తూ తీర్పును ఇవ్వడం జరిగింది.


ఈకేసులో ప్రాసిక్యూషన్ తరపున  పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ పితాని శ్రీనివాసరావు గారు తమ వాదనలను బలంగా వినిపించినారు. అంతే కాకుండా బాధిత బాలిక తల్లిదండ్రులకు పోక్సో చట్టం నిర్దేశించిన ప్రకారం 7,50,000/-  పరిహారం ఇవ్వాలని గౌరవ కోర్టు వారు వారి తీర్పు ద్వారా ఆదేశములు ఇవ్వడం జరిగింది.


ఈ కేసు పూర్వపరాలు పరిశీలించినట్టయితే Cr.No.162/13 U/s 326-A, 354-A (1) (ii), 354 (D) (1) (i), 448, 302, 376 R/W 511 IPC AND SEC. 8 of POCSO ACT-2012 of Pithapuram Town P.S  2013 వ సంవత్సరంలో  నమోదైన కేసులో ఫిర్యాది/భాదితురాలు, వయసు 17 సంవత్సరాలు తండ్రి శంకర్ బాబు, వేణుగోపాల స్వామి దేవాలయం గుడి వీధి, పిఠాపురం పట్టణం అను ఆమెను నిందితుడు ముక్కుడుపల్లి నవీన్ కుమార్ @ నవీన్, తండ్రి నాగేశ్వరరావు, కత్తులగూడెం, పిఠాపురం పట్టణం అను వ్యక్తి ప్రేమిస్తున్నానని ఫోన్ ద్వారా వేధించడం మరియు ప్రేమించమని బలవంతం చేయడంతో బాధిత బాలిక  అతని ప్రపోజల్ ను నిరాకరించడంతో, ఆమె తల్లిదండ్రులు  వారి కుమార్తెను వేధించవద్దని ముద్దాయిని హెచ్చరించి ఆమెను చదువు మాన్పించివేసినారు. తరువాత బాలిక  తల్లిదండ్రులు అనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయించిన సందర్భంలో ది18-12-2013 తేదీన ఉదయం బాలిక తల్లిదండ్రులు పెళ్లికి కొత్త బట్టలు కొనడానికి రాజమండ్రి వెళ్ళగా, భాదిత బాలిక ఇంట్లో నిద్రించుచుండగా ముద్దాయి బాలిక ఇంట్లోకి బలవంతంగా చొరబడి, తన లైంగిక కోరికను తీర్చమని  ఆమె పై బలవంతంగా అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె అతని నుండి తప్పించుకొని వంట గదిలోకి పరిగెత్తుకుని వెళ్లిన తరుణంలో నిందితుడు తన లైంగిక కోరికను తీర్చేందుకు నిరాకరించిన ఆమెను వెంటాడి నిన్ను వేరొకరికి దక్క నీయనని” అంటూ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి అంటించినాడు. వెంటనే ఆమె మంటలతో బిగ్గరగా కేకలు వేయగా ఇరుగుపొరుగు మహిళలు వచ్చి నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోయాడు. ఫలితంగా ఆమె ముఖం, మెడ, ఛాతీపై, మరియు ఆమె రెండు చేతులు మరియు కాళ్ళపై కాలిన గాయాలు అయి చికిత్స పొందుతూ ది 23.12.2013 వ తేదీన GGH, కాకినాడ నందు మరణించినది.


ఈ సంఘటనపై పైన తెల్పిన కేసును అప్పటి SI SVV లక్ష్మీ నారాయణ కేసు నమోదు చేసిన సందర్భంలో ది19.12.2013 వ తేదీన ముద్దాయిని అప్పటి దర్యాప్తు అధికారి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో  దర్యాప్తు అధికారులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ S రాంబాబు, KVVNB ప్రసాద్, A.పల్లపురాజు గార్లు వారి దర్యాప్తును పూర్తిచేసి ది 30.08.2014 వ తేదీన గౌరవ న్యాయస్థానంలో చార్జ్ షీటు దాఖలు చేసినారు.


ఈ కేసులో ప్రాసిక్యుషన్ తరపున హాజరై వాదనను వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని కేసు దర్యాప్తులో చురుకైన పాత్ర పోషించిన అప్పటి పోలీసు అధికారులను , ప్రత్యక్షంగా కేసు విచారణను పర్యవేక్షించిన పిఠాపురం సిఐవైఆర్కే శ్రీనివాస్ పిఠాపురం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మరియు కోర్టు సిబ్బందిని కాకినాడ జిల్లా, SP, శ్రీ M.రవీంద్రనాధ్ బాబు గారు ప్రత్యేకంగా అభినందించినారు.

Comments