హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు "రక్షణ "- జిల్లా ఎస్పీ రవిప్రకాష్

 జిల్లా పోలీస్ కార్యాలయం, భీమవరం. (ప్రజా అమరావతి);


*హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు "రక్షణ "- జిల్లా ఎస్పీ రవిప్రకాష్


.*




2 వీలర్ వాహనదారులు అందరు తప్పని సరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి.


హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే  హెల్మెట్ కొనిపిస్తాం,లేదా హెల్మెట్ తెచ్చుకుంటే నే వాహనం విడుదల చేస్తాం.-ఎస్పీ


2వీలర్ వాహనం తో రోడ్ ఎక్కితే హెల్మెట్ ధరించడం తప్పనిసరి -ఎస్పీ 


లోకల్ పీపుల్ అయినా రోడ్ మీద కి వస్తే హెల్మెట్ తప్పినిసరిగా ధరించాలి.


ఫిబ్రవరి 1 వ తారీకు నుంచి మార్చ్ 1 వ తారీకు వరకు ప్రతి రోజు ఉదయం 06గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జిల్లా అంత హెల్మెట్ ల మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది, ఈ డ్రైవ్ లో హెల్మెట్ ధరించని వాహనదారులు కు ఎటువంటి జరిమానా విధించకుండా, వాహనం సీజ్ చేసి అక్కడే హెల్మెట్ కొనిపించడం లేదా ఇంటి వద్ద ఉంటే తెప్పించడం తరువాత వాహనం విడుదల చేయడం జరుగుతుంది.


ఎస్పీ  మాట్లాడుతు రోడ్ ప్రమాదాలు లో చనిపోతున్న ఎక్కువ 66శాతం మంది హెల్మెట్ లేక తల పగిలి చనిపోతున్నారు అని, అదే విధంగా చనిపోయిన వారిలో ఎక్కువ యువత ఉంటుంది అని అందుకే ప్రతి 2 వీలర్ వాహనందరుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఇంటి నుంచి బయటికి రావాలని, ఆలా రాకుండా రోడ్ మీదకి వస్తే కౌన్సిలింగ్ నిర్వహించడం తరువాత హెల్మెట్ కొనిపించి పంపిస్తాం, పోలీస్ వారు ఆపినపుడు సమయం ఆలస్యం కాకుండా ఆఫీస్ కి వెళ్ళే వారు స్టూడెంట్స్ ఇతర పనులు మీద వెళ్లే వారు తప్పనిసరిగా ధరించాలి అని తెలిపారు.

Comments