ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తి ఆయింది .


 

                 ఏలూరు, ఫిబ్రవరి, 24 (ప్రజా అమరావతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గాల నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తి ఆయింది .


శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ పి .అరుణ్ బాబు నామినేషన్ల పరిశీలన  ప్రక్రియను పరిశీలించారు. మొత్తం 8 మంది అభ్యర్థులు 15 నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలన అనంతరం 7గురు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు.  వై ఎస్ ఆర్ సిపి పార్టీ నుండి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్ ల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించి పరిగణనలోనికి తీసుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ పి .అరుణ్ బాబు చెప్పారు. వంకా రాజకుమారి, వీరవల్లి చంద్రశేఖర్, దేవరపల్లి ఆదాం, గోరింక దాసు, పసల వెంకటాచలం నామినేషన్లను ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లుగా గుర్తించి పరిగణనలోనికి తీసుకున్నట్లు అరుణ్ బాబు తెలిపారు.  ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నల్లి రాజేష్ నామినేషన్  3 సెట్లు నిబంధనల మేరకు లేకపోవడం  తిరస్కరించినట్లు అరుణ్ బాబు తెలియజేసారు.


Comments