మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చింది చంద్రబాబే.


 చిత్తూరు (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో చిన్నారులపైనా అత్యాచారాలు

మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కావాలి

గతంలో ఇచ్చిన పెన్షన్లు తొలగిస్తున్నారు

యువతులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలి

నిత్యవసర సరకుల ధరలు మండుతున్నాయి.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది.

........

*నారా లోకేష్ మాట్లాడుతూ....*

పాదయాత్రలో అన్ని నియోజకర్గాల్లో మహిళల సమస్యలు తెలుసుకుంటున్నా

2019 తర్వాత రాష్ట్రంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధిక ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పన్నుతోనే ధరల పెరుగుదల.

టీడీపీ రాగానే పన్నులు తగ్గించి..ధరలు అందుబాటులోకి తెస్తాం.

మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చింది చంద్రబాబే.

2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పసుపు కంకుమ కింద రూ.20 వేల కోట్లు ఇచ్చాం

టీడీపీ హయాంలో మహిళలపై ఏనాడైనా ఇన్ని దారుణాలు జరిగాయా.?

మహిళల వైపు చూడాలంటే గుడ్లు పీకుతాం అన్నాడు. గన్ కంటే జగన్ వస్తాడని మాటలు చెప్పారు

900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి..ఒక్కరి గుడ్లైనా పీకాడా ఈ సీఎం.?

సంపూర్ణ మద్యనిషేధం అన్న తర్వాతే ఓట్లు అడుగుతాం అన్నాడు..ఇదే మహిళలకు జగన్ చేసిన మొదటి మోసం.

నాలుగేళ్లైనా మద్య నిషేధం చేయకుండా..కల్తీ మద్యంతో వాళ్లే వ్యాపారం చేస్తున్నారు. 

వైసీపీ నాయకులు వస్తే చీపుర్లు పట్టుకుని మహిళలు తరమాలి.

45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని..ఉన్న పెన్షన్లు పీకేస్తున్నాడు

సీఎం సొంత నియోజవర్గంలో మహిళను చంపితే దిశ చట్టం ద్వారా శిక్షించలేదు.

అమ్మఒడి..ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రూ.15 వేలు ఇస్తానన్నారు.

డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులు పక్కదారి పట్టించారు.

సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేనోడు సాధారణ మహిళలకు ఏం న్యాయం చేస్తాడు.

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కోరిన సునీతను కూడా తరిమేశారు.

మానభంగం చేస్తే ఏ పోలీసూ రాడు..కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం పరిగెత్తుకొస్తారు.

ఆసరా గురించి పలమనేరులో మాట్లాడిన రాణెమ్మ ఇంటికి పోలీసులను పంపి బెదిరిస్తున్నారు.

ఎంతమందిపై కేసులు పెడతారు..మహిళలంతా గెంతెత్తితే జగన్ పారిపోతాడు.

Comments