సర్వేపల్లి నుండే పోటీ చేస్తా.. - సోమిరెడ్డినే ప్రత్యర్థిగా కోరుకుంటా"...!

 *"సోమిరెడ్డి వ్యాఖ్యలపై కాకాణి కామెంట్స్"*


*"సర్వేపల్లి నుండే పోటీ చేస్తా.. - సోమిరెడ్డినే ప్రత్యర్థిగా కోరుకుంటా"...!


*


*సర్వేపల్లి నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సోమిరెడ్డి మరలా పోటీ చేస్తే, నా గెలుపు "నల్లేరు మీద నడకే"*

*- మంత్రి కాకాణి*


SPS నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, ఇడిమేపల్లి గ్రామ సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా 2వ రోజు రామదాసుకండ్రిగ గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి .



సోమిరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి.


నాకు సర్వేలు చేయించే అలవాటు, ఆనవాయితీ ఎన్నడూ లేదు.


 తెలుగుదేశం పార్టీతో పాటు అనేక సంస్థలు చేపట్టిన సర్వేల్లో సర్వేపల్లి నియోజకవర్గం లో 14.5% ఓట్ల అత్యధికతో వైకాపా ముందంజలో ఉంది.


 వైకాపా అభ్యర్థిగా నిలవనున్న నాపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తే, 19% ఓట్ల మెజారిటీతో నా గెలుపు ఖాయమని సర్వేలు నిర్వహించిన అనేక సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.


 అనేక చానల్స్ వాళ్ల విశ్లేషణలో కూడా, సర్వేపల్లిలో వైకాపా ముందంజలో ఉందని స్పష్టం చేశాయి.


 సర్వేపల్లిలో మరోసారి ఓటమి తప్పదని తెలుసుకున్న సోమిరెడ్డి పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తూ, ఏదేదో మాట్లాడుతున్నాడు.


 సర్వేపల్లి ప్రజలంటే నాకు ప్రాణం, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతోనే ఉంటా.. రాజకీయాల్లో ఉన్నంతవరకు సర్వేపల్లి నియోజకవర్గం నుండే పోటీ చేస్తా...


 సర్వేపల్లిలో గెలవలేక ఎటు వెళ్లాలో తెలియక సోమిరెడ్డి నియోజకవర్గాలను వెతుక్కుంటూ, తాను వెళ్లాలని ఆలోచన చేస్తూ, అక్కడి నాయకులతో మాట్లాడుతూ, అయోమయంలో ఉన్నాడు.


 సోమిరెడ్డి పలాయనం చిత్తగించడానికి సిద్ధపడి, దానిని ఇతరులకు ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు.


 సోమిరెడ్డి మా గురించి ఆలోచన చేయకుండా, తన గురించి ఆలోచన చేసుకుంటే మంచిదని హితవు చెబుతున్నాం.


 సోమిరెడ్డి సర్వేపల్లిలో వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలవ్వడంతో, టికెట్ ఇవ్వడం కూడా కష్టం కావడంతో, ఆందోళనతో మతిభ్రమించి, ఏదేదో మాట్లాడుతున్నాడు.


 సర్వేపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎవ్వరూ పోటీ చేయడానికి ముందుకు రాకపోవడంతో, మరలా సోమిరెడ్డినే బలిపశువును చేయబోతున్నారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే చరిత్ర సృష్టించాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ను సర్వేపల్లి ప్రజలు 2014లో తిరగరాసి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, నాకు ఆశీస్సులు అందించి, వైకాపా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు.


సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు మూడోసారి కూడా సర్వేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి *"హ్యాట్రిక్"* విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.


 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతిపక్ష శాసనసభ్యునిగా, అధికార పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా, ప్రతి కుటుంబంలో *"ఇంటి బిడ్డగా"* నే వ్యవహరిస్తున్నా..


 సోమిరెడ్డి మంత్రిగా మితిమీరిన అహంకారంతో నిత్యం నియోజకవర్గ ప్రజలను దూషించి, అవమానపరిస్తే, నేను మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు అత్యంత గౌరవమిస్తూ, మరింత చేరువుగా వ్యవహరిస్తున్నా..


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.


 ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయం, తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలవడం తథ్యం.

Comments